గుంటూరు : తాడేపల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 19 న జరగబోయే సామాజిక సమతా సంకల్ప సభ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పి రెడ్డి, మొండితోక అరుణ్, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమను రాజశేఖర్ పాల్గొన్నారు.