అంబేద్కర్ స్ఫూర్తిని ఏ.పీలో సీఎం జగన్ అనుసరిస్తున్నారు
అంబేద్కర్ వల్లే వ్యవస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నాయి
ఈనెల 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా తరలిరానున్న దళితులు బడుగు బలహీన వర్గాలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చరిత్రలో ఎప్పటికీ గొప్పగా నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 19 న జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఉన్నత అధికారులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుందని చెప్పారు. 81 అడగుల వేదిక…125 అడుగుల మహా శిల్పం మొత్తం 206 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. రూ. 400 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ.అతి పెద్ద విగ్రహం విజయవాడకి పెద్ద ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
ఈ విగ్రహం చరిత్రలో నిలిచే విధంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి 2024 లో పూర్తి చెయడం మంచి పరిణామమన్నారు.
అంబెడ్కర్ స్ఫూర్తిని జగన్ కొనసాగిస్తున్నారు : సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో దళితులకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించేందుకు అంబేద్కర్ కృషి చేశారో అదే రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయంటే అందుకు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ కారణమని ఆయన కోనియాడారు. న్యాయ వ్యవస్థ , కార్యనిర్వాహక వ్యవస్థ ,శాసన వ్యవస్ద అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే ఆయన రాసిన రాజ్యాంగమే ప్రధానమన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని చెప్పారు.నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో దళిత, బడుగు, బల హీన వర్గాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శక్తివంచనలేకుండా కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే పేదల పట్ల సిఎం జగన్ గారికి ఉన్నటు వంటి మమకారం …వారిని పైకి తీసుకురావాలన్న ఆకాంక్షతో అంబేద్కర్ గారు ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు.
అంబేద్కర్ ఒక దార్శనికుడు… ధీశాలి : అంబేద్కర్ ఒక దార్శనికుడు… దిశాలి… తన జీవితకాలమంతా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం…. సమాజంలో వివక్షతను తొలగించడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు..
అంబేద్కర్ ఆలోచన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం.. సమ సమాజ భావనతో తన జీవిత కాలమంతా కృషి చేశారని గుర్తుచేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం సమ సమాజానికి ఒక ప్రతి రూపంగా నిలుస్తుందని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే గొప్ప అద్యాయంగా నిలిచిపోతుందన్నారు.. ఎలాగైతే మనం సమ సమాజం అన్న భావానను ముందుకు తీసుకెళ్తున్నామో అదే విధంగా భావితరాలు ఆయన ఆశయాలకు ఆకర్షితులవుతారని అందుకు ఈ విగ్రహం స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 19 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని దళిత బహుజనులతో పాటు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఇష్టపడే వారందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమానికి లక్షకు పైచిలుకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు…. ఈ అంబేద్కర్ స్మృతివనం భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రంగా రూపొందనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు…అందరినీ ఆకర్షించే విధముగా లోపల లైబ్రరీ, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, ఆయన జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని వివరించారు. ఈ నెల 20 తర్వాత ఈ స్మృతి వనం అందరికీ అందుబాటులో ఉండనుందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానిదా లేక పార్టీదా అన్నది ప్రశ్నే కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ప్రతి రాజకీయ పార్టీ ప్రశంసిస్తుందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా పాల్గొనాలని ఒక్క మాటతో ముగించారు. దళిత అభివృద్ధి కోసం దళితులను కోసం పని చేసిన మహానీయుడు అని చెప్పారు.పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. అంబేద్కర్ మహానీయుడు భారతదేశంలో పుట్టకపోతే దళితులపై వివక్షత అస్పృశ్యత ఇప్పటికీ కొనసాగేవని చెప్పారు.. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించారని విజయసాయిరెడ్డి తెలిపారు. మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు.