వృద్ధులు మధ్యన డాక్టర్ శ్రావణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
ప్రజా వైద్య నిరూపమాన సేవలు అభినందనీయం
జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్
విజయవాడ : ప్రజా వైద్య శాల నిర్వాహకులు డాక్టరు శ్రావణ్ కుమార్ నిరుపమాన సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ కొనియాడారు. శుక్రవారం ప్రజావైద్యశాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేయింబవళ్లు అవిశ్రాంతంగా కేవలం రూ 20 లకే సేవలు అందిస్తున్న శ్రావణ్ కుమార్ వృత్తిలో కొండప్రాంతంలో వందలాది మెట్లు ఎక్కి దిగుతూ వైద్యం చేయడం అనితరసాద్యం అని పోతిన కొనియాడారు. ఇదిలా ఉండగా భావానిపురం లోని శ్రీ వెంకట సాయిశ్రీ వృద్ధాశ్రమ సేవా సంఘం ఆశ్రమంలో వృద్ధులు మధ్య డాక్టర్ శ్రావణ్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.వారికి దానిమ్మ కాయలు పంచారు.ఆ వృద్ధులు శ్రావణ్ కుమార్ కి దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వహకురాలు వల్లిమల్ల నాగ రాజీ తదితరులు పాల్గొన్నారు.