ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలిసిన ఏపీయంఈయస్ఏ నేతలు
విజయవాడ : ఏపీ జే.ఏ.సి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, ఇతర కార్యవర్గ సభ్యులు తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే.యస్.జవహర్ రెడ్డిని విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారంమర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగుల ప్రధాన సమస్యలుపై 11 అంశాలతో వినతి పత్రం సిఎస్ కి ఇచ్చామని తెలిపారు. అన్ని కార్పొరేషన్లకు సర్వీస్ రూల్స్ తయారు చేసి అమలు చేయాలని, కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లు మరియు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపి జనాభా సంఖ్య కు అనుగుణంగా కేడర్ స్ట్రెంగ్త్ మంజూరు చేయాలని, అసమగ్రంగా ఉన్న ఆప్కాస్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వివిధ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞపతి చేశారు.
బిల్ కలెక్టర్ గా పని చేయుచున్న వారిని సెక్రటరీలుగా నియమించడం వలన వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించి అడ్మిన్ సెక్రటరీ విధుల నుండి బిల్ కలెక్టర్లను తప్పించాలని, ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ను మిగతా ఉద్యోగులతోపాటు డ్రైవర్లు క్లీనర్లు మరియు మెకానిక్ లకు కూడా వర్తింపచేయాలని, అర్హత గల ఉద్యోగులకు డ్రైవర్లుగా పదోన్నతి ఇవ్వాలని, 11 ప్రధాన అర్థికేతర అంశాలు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు కోరారు. ఈ అంశాలను క్లుప్తంగా వినిన సిఎస్స మస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమo లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె శివరాం ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వీరభద్రయ్య, దేవరాయలు, కోశాధికారి ఎం. రవి, సెక్రటరీ కళ్యాణ్ చక్రవర్తి, రవిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాలి సుధాకర్, జాయింట్ సెక్రెటరీ రాజేష్, ప్రదీప్ కుమార్, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.