చేనేత జౌళి శాఖ కమీషనర్, ఆప్కో వైస్ ఛైర్మన్, ఎండి ఎంఎం నాయక్
అమరావతి : రాష్ట్రంలోని అన్ని ఆప్కో విక్రయశాలల్లో సంక్రాతి పండుగ సందర్బంగా సరికొత్త వస్త్రశ్రేణిపై 30శాతం ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు చేనేత జౌళిశాఖ కమీషనర్, ఆప్కో వైస్ ఛైర్మన్, ఎండి ఎంఎం నాయక్ తెలిపారు. ఎంపిక చేయబడిన వస్త్రశ్రేణిపై 50 వరకు ప్రత్యేక రాయితీని ఇస్తున్నామన్నారు. ఈ అవకాశం ఈనెల 21 అదివారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా చేనేత కళాకారుల ఉన్నతికి పాటు పడుతున్న ఆప్కో రాష్ట్రం లోని చేనేత వస్త్రాభిమానుల కొరకు తగ్గింపు ధరలలో ఆధునిక వెరైటీలను సిద్దం చేసిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు చేనేత మగ్గాలపై నేసిన, నాణ్యమైన, పేరెన్నికగల వెంకటగిరి , మంగళగిరి , మాధవరం , చీరాల, ఉప్పాడ, పట్టు, కాటన్ చీరలు, మదనపల్లి, ధర్మవరం పట్టు చీరలు , పోలవరం , అంగర, బందరు, రాజమండ్రి మోరి కాటన్ ఫాన్సీ చీరలు, తువాళ్ళు, ధోవతులు, లుంగీలు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళలు, పురుషులు, పిల్లలకు అవసరమైన రెడీమేడ్ గార్మెంట్స్, లాల్చీ ఫైజమా, మోడీ జాకెట్స్, డ్రెస్ మెటీరియల్స్‌పై కూడా సంక్రాంతి రాయితీ లభిస్తుందని, చేనేత వస్త్రాభిమానుao సమీప ఆప్కో విక్రయశాలలను దర్శించి ఈ సంక్రాతి పండుగను ఆప్కో వస్త్రాలతో జరుపుకొని నేత కార్మికులకు చేయూత నివ్వాలని నాయక్ తెలిపారు. అప్కో చేనేత వస్త్రాలు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయని, వెబ్సైటును సందర్శించటం ద్వారా కోరుకున్న వస్త్రాలను నేరుగా ఇంటికే అర్డర్ చేయగలిగే అవకాశం ఉందని వివరించారు.