కొవ్వూరు : అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను, ఆహ్వాన పత్రికను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితకు అందజేశారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం బృందం ఆమెకు అందించారు. అనంతరం హోంమంత్రికి వేదాశ్సీస్సులు ఇచ్చి శేషవస్త్రంతో సత్కరించారు. తానేటి వనిత భవిష్యత్ లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతా మంచే జరగాలని వేద పండితుల బృందం ఆశీర్వదించింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరిపైన ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు శ్రీరామా సొసైటీ చైర్మన్ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.