స్వాగతం పలికిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ : సోమవారం రాత్రి ఢిల్లీ నుండి బయలు దేరి గన్నవరం విమానాశ్రయానికి చెరుకున్న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌కు విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంట్, అసెంబ్లీ-2024 ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించే సదస్సుకు హాజరు కానున్న చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ లు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్ కు బయలు దేరి వెళ్ళారు. నోవాటెల్ హోటల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, సబ్ కలెక్టర్ అదితి సింగ్. డిఆర్ఓ ఎస్.వి.నాగేశ్వరావులు స్వాగతం పలికారు.