రైతు కన్నీరు, ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినబడటం లేదు.
63 శాతం జీడీపీ రైతుల ద్వారానే వస్తుంది
రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయి.
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొలేదు.
బడ్జెట్ లో పెట్టిన 3 వేల కోట్ల డిసాస్టర్ ఫండ్ ఏమైంది.
రాష్ట్రానికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది
జగన్ మోహన్ రెడ్డి ని నమ్మి రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.
షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
నెల్లూరు : నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగరంలోని హరనాథపురం లో గల వారి నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అధోగతిగా మారిందని రైతులకన్నీరు ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడటం లేదని జగనన్న వస్తే వర్షాలు వస్తాయని ప్రగల్బాలు పలికారని రాష్ట్ర పరిస్థితి అతివృష్టి అనావృష్టిల తయారైందని అన్నారు. వాతావరణ మార్పులు ప్రభుత్వ పాలసీలతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని భారతదేశానికి 63% జీడీపీ రైతుల ద్వారానే వస్తుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని రైతులకు అందాల్సినవి ఏవి వైసిపి ప్రభుత్వం లో అందటం లేదని రైతులకు యూరియా కోసం క్యూ లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. తుఫానులో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని బడ్జెట్లో పెట్టిన మూడు వేల కోట్ల డిసాస్టర్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు. టిడిపి హయాంలో 75 శాతం పూర్తిచేసిన పోలవరాన్ని వైసిపి పూర్తి చేయలేక పోయిందని కనీసం పంటకాలు వల పూడికలు తీసిన పాపాన కూడా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న కాంటీన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి రైతులను ఏం ఆదుకుంటారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్యాంటీన్ కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షీర్ వాల్ టెక్నాలజీతో అత్యాధునిక వసతులతో తొమిది లక్షల ఇళ్లు నిర్మించామని వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటిని కూడా వారికి ఇవ్వలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పరిశ్రమలు రాష్ట్రానికి రావటం లేదని వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయని అన్నారు. లూలు, అదాని డేటా సెంటర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రామాయపట్నం పేపర్ మిల్ లాంటి పరిశ్రమలు ఎన్నో తరలిపోయాయని అవి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఉంటే నిరుద్యోగ సమస్య ఉండేది కాదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలనే కాదు తన నీడను కూడా నమ్మే పరిస్థితిలో లేడని, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి కాపాడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రానికి ఇర్రీపేరబుల్ డ్యామేజ్ జరిగిందని, రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి బాగుపడాలంటే అనుభవం ఉన్న వ్యక్తి నీ ఎన్నుకోవాలని సూచించారు.