అమరావతి : ఈనెల 8న ఏపీలో జరుగుతున్న సమ్మెలపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను సీపీఎం నేతలు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ ప్రారంభం కానున్నది. ఆయా వర్గాలు తమ సమస్యలు పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.