విజయవాడ : మానవజన్మ ఎత్తీన మనుషులలో ఆది మానవుడుగా గుర్తింపు పొందిన వారే గిరిజనులు, వీరిని మూలవాసులని, ఆదివాసులని, గిరిజనులు, గిరిపుత్రులు, ప్రకృతి పూజారులని, ప్రకృతి సంరక్షకులని వివిధ పేర్లతో కొనియాడతారు. ప్రకృతిపై ఆధారపడి జీవించిన వీరు ప్రకృతి ఫలాలను సమాజానికి పరిచయము చేసి, అందిస్తు నాగరికతకు ఆమడ దూరంలో ఉన్నారు. ఆదివాసులు పర్యావరణ పరిరక్షణకు అందించిన సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 1994లో ఆగష్టు 9 వ తేదీన “ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజీనస్ పీపుల్” (ఆదివాసి దివాస్)గా ప్రకటించింది. ఈ రోజున వారి శ్రమను గుర్తించి వారిని ప్రోత్సహించి సన్మానిస్తారు. వీటిని చాలా దేశాలు, రాష్ట్రాలు అధికారికంగా నిర్వహించడం లేదు. ప్రస్తుతం వారి వారసులు ప్రపంచంలోని 90 దేశాలలో 45 కోట్ల జనాభా ఉన్నట్టుగా అంచనా, ఇందులో ఒక అషియా ఖండంలోనే 70% గిరిజనులు ఉండగా, మన దేశంలో 720 గిరిజన తెగలు కలవు, మన దేశంలో 1963 జనాభా లెక్కల ప్రకారం గా నిర్ధారించిన 7.5% నే విద్యా ఉద్యోగాలలో కొనసాగిస్తున్నారు. గిరిజనుల జీవన పరిణామ క్రమంలో అక్షర బద్ధం కానీ లిపి లేని భాష మాట్లాడుతూ, కొందరు స్తిరనివాసాలు లేక సంచారులుగా, మరి కొందరు కొండకోనలలో పోడు భూములను, అటవీ ఉత్పత్తుల పై ఆధారపడి జీవనం సాగించారు. గిరిజనుల జీవన గమనంలో తమ మనగడ కొనసాగించడానికి ప్రతి గిరిజన తెగ తమదైన భాష, వస్త్ర ధారణ, ఆభరణాలు, జానపద కళారూపాలను అలవర్చుకున్నారు, వారి జీవనానికి అలవరించుకున్న సహజ అలవాట్లు,వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు గా మారాయి. భాషకు లిపిలేకున్న వాటిని మౌఖికంగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు.
గిరిజనుల అపురూప జానపద కళారూపాలను వేల సంవత్సరాలుగా మౌఖి కంగా తరతరాలుగా దేశ విదేశాల్లో ప్రదర్శిస్తూ, ఈ దేశమకుటంలో కిరీటమైన నిలిచి దేశానికి ప్రపంచ దేశాల్లో గొప్ప కీర్తిని ఆపాదిస్తున్నారు. ఈ దేశంలోని గిరిజనులు మనదేశంలోని పేరు ప్రక్యతి గాంచిన ప్రజాస్వామ్య వాదులు జ్యోతిభ పూలే కంటే ముందే జన్మించి, కాల మాన పరిస్థితులను అధిగమిస్తూ, దేశ నిర్మాణం తో పాటు సామ్రాజ్య వాద శక్తులను, విదేశీ పాలకులను ఎదిరించి మాతృభూమి హితంకోసం మాన,ప్రణాలను సైతం తృణ ప్రాయంగా త్వాగం చేసిన వారి చరిత్ర ఈ దేశ చరిత్ర పుటల్లో లేక పునాదిరాళ్లుగా దాగి ఉన్నారు. 2022 నవంబర్, ఒకటవ తేదీన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గిరిజనులు లేకుండా ఈ దేశం లేదని చెప్పినారు. గిరిజనులు దేశభక్తులు దేశానికి మూలవాసులైన ఆదివాసీలు, గిరిజనుల సేవలు మరువరానివి. 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కష్టాలు తొలగలేదు.
1.ఆదివాసీ గిరిజనులకు కల్పించిన రాజ్యాంగపరమైన హక్కులను అమలు పరుస్తూ, పరిరక్షించాలి.
2.అటవీ హక్కు చట్టాన్ని అమలు పరచాలి
3. పీసా చట్టం 1996 ఉల్లంఘించరాదు పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, దీని ద్వారా గ్రామ సభ ద్వారా సహజ వనరుల పరిరక్షణ జరుగుతుంది.
4. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులఅభ్యున్నతి కోసం “జాతీయ సమగ్ర గిరిజన పాలసి”ని ప్రకటించి అమలుచేయాలి.
5. ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలోని గిరిజన యువతకు ఉపాధి కల్పించే GO3ని సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసారు, దాని పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి.
6.ఆంధ్ర రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉన్న లంబాడి సుగాలి ఎరుకల జాతులకు మైదాన ప్రాంత ఐటిడీఏ లను ప్రారంభించాలి.
7. గుడాలు, చెంచుపెంటలు, తండాల సమగ్ర అభివృద్ధికై కర్ణాటక వలె బడ్జెట్ కేటాయించి, డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలి.
8. ఈ దేశంలో అర్హులైనటువంటి గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వాలు100కు పైగా గిరిజన తెగలను షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం తో ఎస్టీ కమిషన్ ఆఫీస్ లో ములుగుతున్నవి.
9. ఉదాహరణకు ఈ దేశంలో వివిధ పేర్లతో పిలవబడు తున్న ఆదిమ బంజారా లు ఒకే భాష, సంస్కృతి సంప్రదా యాలు కలిగి రాజ్యాంగ నిపుణులచే గిరిజనలుగా నిర్ధారించబడిన కేవలం ఐదు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాలలో వివిధ కులాల జాబితాలో చేర్చడం, కేంద్ర ప్రభుత్వం దొంద నీతికి నిదర్శనం.10. 1963 నుండి ఈనాటికి దేశంలో విద్యా, ఉద్యోగాలలో
కేంద్రంలో 7.5% ఏడున్నర శాతంగానే కొనసాగుతుంది.
11. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు గిరిజనుల పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించి అడ్మిషన్ లలో గిరిజన విద్యార్థులకు ఏడున్నర శాతం వర్తించడం దురదృష్ట కరం.
12.కోట్ల జనాభా మాట్లాడే గిరిజనుల భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చకపోవడం, వారి మూలాలను విశ్లేషించక పోవడం, వారి వీర యోధులు, సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులు భాహ్యా సమాజానికి తెలియకపోవడంతో గాలిలో దీపంలా వేలాడుతున్నారు.
13. ప్రకృతినే దేవతలుగా తన్నుకున్న వారి దేవతలకు ఇతరుల దేవతల వలల్లే గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు లేకపోవడం వారిని ఇంకా నాగరికత లోకానికి దూరంగా నెట్టివేస్తుంది.14. రిజర్వేషన్లు అన్ని రంగాలలో రెండు శాతం అమలు కాకపోవడం శోచనీయం.
15. 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనుల ప్రమేయం లేకుండా, వారిని భాగస్వాములు చేయకుండా ప్రాజెక్టుల పేరుతో తొలగించడం చట్ట వ్యతిరేకం.
16. అటవీ చట్టాలను అమలుపరచకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి లక్షల గిరిజన కుటుంబాలను అటవీ నుంచి తరిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆచార్య అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.