కాకినాడ : డా. బి. అర్. అంబేద్కర్ జిల్లా ఐ. పోలవరం కు చెందిన ప్రజా చైతన్య సాంస్కృతిక సంస్థ ప్రతి యేట సాహిత్యం లో కృషికి ఇస్తున్న సాహితీ సాగర్ పురస్కారo ఈ ఏడాది కాకినాడకు చెందిన ప్రముఖ కవయిత్రి ఎం. లక్ష్మి కి లభించింది . లక్ష్మి గత నాలుగు సంవత్సరాలు గా కవితలు రాసి, అనేక పురస్కాారాలు అందుకున్నారు. ఈమె రామచంద్ర పురం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.