విజయవాడ : నా పాలనలో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
నాలుగేళ్లలోనే రూపు రేఖలు మారిన విజయవాడ : విజయవాడ ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటుందని, ఒకవైపు ఫ్లైఓవర్లు,మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. వాణిజ్యపరంగా విజయవాడ నగరం కేవలం నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోందని, ప్రతి ఏడాది కృష్ణా నది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధపడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తిస్థాయి ఉపశమనం లభించిందని ఆయన అన్నారు.. నగరం నడిబొడ్డున ఠీవీ గా నిలిచిన అంబేద్కర్ విగ్రహం. అభివృద్ధి అంటే ఇది అన్నట్లు మనందరికీ చూపిస్తోందని, మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసుపోని రీతిలో విజయవాడ రూపులేఖలు మారిపోయాయని చెప్పారు.