సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి * డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు జనవరి 8, 9 తేదీల్లో ఉద్యోగ మేళా * అంతర్జాతీయ సంస్ద సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ లో అవకాశాలు
విజయవాడ : డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో 2022, 2023 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు, 1 నుండి 3 సంవత్సరాల అనుభవం కలిగియున్న అభ్యర్థుల కోసం విశాఖ వేదికగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పునరుత్పాదక ఇంధన పరిష్కారాల ప్రొవైడర్ గా ఉన్న సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా దేశవ్యాప్తంగా డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అవకాశాల కోసం ఉద్యోగ మేళా నిర్వహించటం జరగనుందన్నారు. జనవరి 8, 9 తేదీలలో విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్లో దీనిని నిర్వహిస్తున్నామని నాగరాణి తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ అవకాశాలను విద్యార్థులు అంది పుచ్చుకునేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం సాంకేతిక విద్యా శాఖ ట్రైనింగ్, ప్లేసెమెంట్ విభాగం అధికారులను 7382082692, విశాఖపట్నం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సిబ్బందిని 7382463845 నెంబర్ లలో సంప్రదించవచ్చని చదలవాడ నాగరాణి వివరించారు.