ఈబీసీ నేస్తం రెండో విడతకు సంబంధించి ఇప్పటినుంచే అధికారులు, సచివాలయ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని మల్లాది విష్ణు సూచించారు. అర్హులైన ఏఒక్కరూ పథకానికి దూరం కాకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గతేడాది తొలివిడతగా నియోజకవర్గంలో 1,947 మందికి పథకాన్ని వర్తింపజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. 2022-23 కి గానూ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 14 కల్లా సంబంధిత పత్రాలను వార్డు సచివాలయాలలో అందజేయవలసిందిగా సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.