విజయవాడ : రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తద్వారా ప్రాణ నష్టం జరగాలని
చంద్రబాబు ఆయన ముఠా భావిస్తోందని, ప్రస్తుతం అదే పనిమీదే వారు దృష్టి
కేంద్రీకరిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం పలు అంశాలపై ఆయన తనదైన
శైలిలో స్పందించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి ఎదురు దాడులు ఆహ్వానించే
ప్రయత్నాలు చేస్తున్నారని అయితే టీడీపీ కుట్రలకు ప్రజలే జవాబు చెబుతారని
అన్నారు.
హుందా రాజకీయాలకే సమాజంలో గౌరవం : రాజకీయాల్లో హుందాగా నడుచుకునే వారి మాటలకే
సమాజంలో గౌరవం ఉంటుందని, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు
జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని అన్నారు.
పుష్ప జాతీయ అవార్డుకు తానే కారణమంటున్న చంద్రబాబు : పుష్ప సినిమాలో ఓ సీన్లో
తన ఫోటో గోడకు వేలాడుతూ ఉందని అందుకే పుష్ప సినిమాకు జాతీయ అవార్డు లభించిందని
బాబు బిల్డప్పులు ఇస్తున్నారని అన్నారు. అయితే ప్రజలు వేరేలా భావిస్తున్నారని,
చంద్రబాబు హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరిగిందని ఈ కారణంగానే
పోలీస్ స్టేషన్లో ఆయన ఫోటో తగిలించి ఉంటారని అనుకుంటున్నారని అన్నారు.
మూలధన వ్యయంలో ఏపీ టాప్ : మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో
నిలిచిందని కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 47.79% వ్యయం
జరిగినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే ఏపీ మూలధన వ్యయం
40.8% శాతానికి చేరిందని, అదే సమయంలో కేంద్రం వ్యయం 27.8% మాత్రమేనని అన్నారు.
మూలధన వ్యయం పై కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసిందని అన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ తో పల్లెకు రక్ష : ఫ్యామిలీ డాక్టర్ విధానం పల్లె ప్రజల
ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోందని, సొంత ఊరిలోనే ప్రాథమిక వైద్య సేవలు
అందుతున్నాయని అన్నారు. మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే వైద్యులు వెళ్లి
వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఊళ్లలోనే 14 రకాల వైద్య పరీక్షలు
నిర్వహిస్తున్నారని, అన్ని విలేజ్ క్లినిక్స్ లోనూ 105 రకాల మందులు అందుబాటులో
ఉన్నాయని తెలిపారు. అన్నింటికీ మించి స్పెషలిస్ట్ వైద్యులతో టెలీకాన్ఫరెన్స్
ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం
అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రజల వ్యయప్రయాసలు తగ్గాయని విజయసాయి రెడ్డి
అన్నారు