అక్టోబరు 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
ఏలూరు : ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు జిల్లాలో ఇంటింటి జాబితా పరిశీలన, నూతన
ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో భాగంగా చేపట్టిన
ఇంటింటి సర్వే ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా
కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లోని
గౌతమీ సమావేశ మందిరంలోగుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లాలోని
7 నియోజకవర్గాల ఇఆర్ఓలతో ఓటర్ల జాబితా సర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ
సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఇంటింటి ఓటర్ల సర్వే 99.88 శాతం
పూర్తయిందన్నారు. అక్టోబరు 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడదల చేయడం జరుగుతుందని
దానిని రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షుణంగా పరిశీలన చేసి తప్పొప్పులను తమ
దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సరిచేయడం జరుగుతుందన్నారు. అక్టోబరు
17 నుంచి నవంబరు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లైయిమ్ లు అభ్యంతరాలు స్వీకరించి
వాటిని డిశంబరు 26 వరకు పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను
జనవరి 5న ప్రకటించడం జరుగుతుందన్నారు.
బిఎల్ఓ యాప్ సమాచారం మేరకు జిల్లాలో 7 లక్షల 26 వేల 103 ఇళ్లకు గాను ఇంతవరకు 7
లక్షల 25 వేల 262 ఇళ్లకు సంబంధించి ఓటర్ల జాబితా సర్వే పూర్తయిందన్నారు.
జిల్లాలో జనన, మరణాల రిజిష్టరు ను అనుసరించి 25 వేల 048 మంది మరణించిన వారి
ఓట్లకు సంబంధించి ధృవీకరణ అనంతరం తొలగించడం జరిగిందన్నారు. ఫారం-8 కింద 13
వేల 595 చేర్పులు మార్పులకు ధరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ఫారం-6
ద్వారా 15 వేల 467 మందిని కొత్తగా ఓటర్లను నమోదు చేయడం జరిగిందన్నారు.
నియోజకవర్గం వెలుపల లోపలకు సంబంధించి 4 వేల 590 మంది ఓటర్ల ను గుర్తించి
ఫారం-8కింద ధరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. మరో 3 వేల 41 మంది
ఓటర్లు శాశ్వతంగా షిప్ట్ అయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. సమావేశంలో
అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, డిఆర్ఓ ఏ.వి.ఎన్.ఎస్. మూర్తి, నెరుసు
నెలరాజు(బిజేపి), పి. కిషోర్(సిపియం), రాజనాల రామ్మోహన్ రావు(ఐఎన్ సి),
కలవకొల్లు సాంబ(వైఎస్ఆర్ సిపి), ఎస్. అచ్యుత బాబు(టిడిపి), యం. ధశరధ
కుమార్(ఆమ్ ఆద్మీ పార్టీ),ఈఆర్ఓ లైన సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఆర్టిఓలు
కె. పెంచల కిషోర్, ఝాన్సీరాణి,జెడ్పి సిఇఓ రవికుమార్, స్పెషల్ డిప్యూటీ ఉన్
కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి,. జివివి సత్యనారాయణ, ఎపిఐఐసి జోనల్ మేనేజరు కె.
బాబ్జి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర పాల్గొన్నారు.