జేఎస్డబ్ల్యూ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్ ట్వీట్
అమరావతి : ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పేదల అభ్యున్నతి
కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించడం ఆనందంగా ఉంది’ అని
జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్ ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ తనకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరిస్తున్న ఫొటోను షేర్
చేస్తూ సజ్జన్ జిందాల్ ఈ ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం
వైఎస్ జగన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. రాష్ట్రంలోని పేద ప్రజల
అభ్యున్నతి కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించటం జరిగిందని
ఆయన పేర్కొన్నారు.