ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు
విజయవాడ : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్
గాంధీ అందరూ సమానంగా అభివ్రుద్ధి చెందాలనే నవ సమాజానికి బాటలు వేశారని ఏపీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన
కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఆదివారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రరత్న భవన్ నుంచి సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం
వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో భారీగా తరలి
వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు
అర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ భారత దేశాన్ని
అభివ్రుద్ధి చెందిన దేశాల పక్కన నిలబెట్టాలని, దేశంలో పేదరికం నిర్మూలించాలని
రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు చేపట్టారని వివరించారు. అదే
విధంగా పేద, ధనిక తారతమ్యాలను తగ్గించే సంకల్పంతో మానవ వనరుల శాఖను ఏర్పాటు
చేసి దానికి పీవీ నరసింహారావును మంత్రిగా చేశారని గుర్తు చేశారు. తనకున్న
విజన్ తో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన అభివృద్ధికి రాజీవ్ బాటలు వేశారని
కొనియాడారు. అదే విధంగా నూతన జాతీయ విధానంతో విద్య అందరికీ దక్కాలనే మహాన్నత
ఆశయంతో నవోదయ, ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు గిడుగు రుద్రరాజు
వివరించారు.
పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ
రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పేదలకు మిఠాయిలు, పండ్లను పంపిణీ
చేశారు. ముందుగా సింగ్ నగర్ రాజీవ్ విగ్రహం వద్ద పేదలకు, రిక్షా కార్మికులకు
పండ్లను పంచి పెట్టారు. అనంతరం గాంధీనగర్ లోని చైల్డ్ లైన్ పాటు అనాథలకు
ఆశ్రయం ఇచ్చే నవజీవన్ బాల భవన్ లో చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టారు.
చిన్నారులతో ముచ్చటించిన రుద్రరాజు వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బాల భవన్ పరిస్థితులు, అక్కడి ఏర్పాట్లను ఈ సందర్భంగా సంబంధిత సిబ్బంది పీసీసీ
అధ్యక్షులకు వివరించారు. కస్తూరిబాయిపేట లోని స్త్రీ, శిశు సంక్షేమ భవన్ లోని
చిన్నారులకు కూడా పండ్లు, మిఠాయిలను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెలుగు దేశం మాజీ కార్పొరేటర్
రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్
తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ 10వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ
కార్పొరేటర్ నజీర్ హుస్సేన్ కు కాంగ్రెస్ కండువా కప్పిన పీసీసీ అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నజీర్
మాట్లాడుతూ దేశానికి పునర్వైభవం రాహుల్ నేత్రుత్వంలోని కాంగ్రెస్ పార్టీతోనే
సాధ్యమని అందరం కలసి అధికారం సాధించే దిశగా ముందుకు వెళదాం అన్నారు. ఆర్ పీ ఐ
పార్టీకి చెందిన ప్రధాన నేత అమీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ
సందర్భంగా అమీన్ మాట్లాడుతూ 2024లో దేశానికి రాహుల్ ప్రధానిని చేయడానికి అందరూ
కలసి క్రుషి చేయాలని పిలుపు నిచ్చారు. నాయకులతో పాటు అబ్దుల్ ఖాదర్,
అలిబుల్లా, మెహబూబ్, ఉస్తాద్, అజీమ్, అబ్రార్, రఫీ, నసీమా, రెహానా, రజాక్,
పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో కొత్త చేరికలకు సహకరించిన
నాగూర్ ను రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ బలోపేతానికి
క్రుషి చేస్తామని ఈ సందర్భంగా వారంతా గట్టి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో
రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర
అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ, మేడా
సురేష్, ఖాజా మెహిద్దీన్, లీగల్ సెల్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల
శాస్త్రి, సేవాదళ్ అధ్యక్షులు యలమందారెడ్డి, ఆర్.టీ.ఐ ఛైర్మన్ పీవై.కిరణ్,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసఫ్, కాంగ్రెస్ నేతలు లెనిన్, గౌస్
పలువురు పాల్గొన్నారు.