అమరావతి : అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల
వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను
ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన
సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల
పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను
ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల
మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు.
ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను
సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ
చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు.
వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు.