అమరావతి : ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2018
రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం వేతనాలు సవరిస్తూ ట్రాన్స్కో సీఎండీ ఉత్తర్వులు
జారీ చేశారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్కోలో
పనిచేస్తోన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు
విడుదలయ్యాయి. హైస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్
కార్మికులకు వేతనాలు సవరించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ.30,605కు, స్కిల్డ్ కార్మికులకు
రూ.20,598 నుంచి రూ.27,953కు పెంపుదల చేసినట్టు పేర్కొంది. సెమీ స్కిల్డ్
కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236కు, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.16,473
నుంచి రూ.22,318కి పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఆగస్టు 9వ
తేదీన సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో 2018 పేస్కేల్ ప్రకారం 2 శాతం పెంపుదలకు
విద్యుత్ ఉద్యోగుల సంఘాలు అంగీకరించాయని ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.