గుంటూరు : పర్యాటక రంగంలో అత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ
వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన “హయత్ ప్లేస్” విజయవాడ నగరంలో ఫోర్త్ స్టార్
హోటల్‌ను స్థాపించనున్నదని ఈనెల 18వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి హోటల్ హయత్ ప్లేసన్ను ప్రారంభించనున్నట్లు చైర్మన్ రామిశెట్టి
వీరాస్వామి తెలిపారు. హోటల్ హయత్ ప్లేసును ప్రారంభించవలసిందిగా కోరుతూ బుధవారం
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో హయత్ ప్లేస్ మేనేజింగ్
డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ చింతల రామకృష్ణతో రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఆహ్వానించిన్నట్లు చైర్మన్
వీరాస్వామి తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఇఎస్ఐ ఆసుపత్రి సెంటర్
సమీపంలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ ఫోర్త్ స్టార్ హోటల్ ను అత్యాధునిక
హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన
పట్టణాలలో హయత్ ప్లేస్ స్టార్ హోటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ
రాష్ట్రంలోని హైదరాబాద్ లో మూడు హయత్ ప్లేస్ గ్రూప్ హోటల్ లను దిగ్విజయంగా
నిర్వహిస్తూ పర్యాటకుల అభిమానాన్ని చూరుగుంటున్నామన్నారు. విభజన అనంతరం
ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విజయవాడ నగరంలో హయత్ ప్లేస్ హోటల్‌ను
ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఈనెల 18న ఉదయం 11 గంటలకు హయత్
ప్లేస్ ను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ప్రారంభ కార్యక్రమంలో
రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,
హోటల్స్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారని రామిశెట్టి వీరాస్వామి
తెలిపారు.