విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ
వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం బలిదానం
చేసిన వారికి నివాళులు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం. ఆ విలువలను
నిల బెట్టాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. భావి తరాల వారికి కూడా వారి
త్యాగాలను తెలియ చేయాలి. మన దేశంలో ఉన్న శాంతియుత వాతావరణం ఏ దేశంలొ లేదు.
అనాదిగా వస్తున్న హైందవ విధానాలు ప్రధాన కారణం. అన్ని వర్గాల వారిని అభివృద్ధి
పధంలో నడిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఉంది. అన్ని వర్గాల వారికి
పెద్ద పీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి చేసింది కేంద్రం. సౌభాతృత్వ భావనతో
మనందరం ముందడుగు వేయాలి. మోడీ హయాంలో భారతదేశం లో అన్ని వర్గాల వారికి న్యాయం
జరుగుతుంది. భావి తరాలను దృష్టి లో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా
భారతదేశం మరింత ప్రగతి సాధిస్తుందన్నారు.