గుంటూరు : పంచాయతీ రాజ్ కమిషనర్ డి కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ
వేడుకలు స్పెషల్ కమిషనర్ ఎ.సిరి అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
స్పెషల్ కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, పర్యావరణ
పరిరక్షణకు కృషి చేయాలని సిబ్బందిని కోరారు. రిటైర్డ్ డ్రిల్ మాస్టర్
నాగిరెడ్డి అధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఎన్ సిసి విద్యార్థిని,
విద్యార్థులు జాతీయ గీతాలాపన చేసి, పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు గిఫ్టులు, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్
నాగిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎం.
సుధాకర్ రావు, ఇజిఎస్ సంచాలకులు పి. చిన తాతయ్య, ఇజిఎస్ జాయింట్ కమిషనర్ ఎం.
శివప్రసాద్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ వి. నాగార్జున సాగర్,
గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ జ్యోతి, పిఆర్ & ఉన్నతాధికారులు,
సిబ్బంది పాల్గొన్నారు.