వైఎస్ఆర్ బాటలో నడుస్తోన్న జగన్ మేలును ఉత్తరాంధ్ర మరువదు
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబుజ్ 14 ఏళ్ళు సీఎంగా ఏం చేయలేదని బాబు ఒప్పుకున్నాడు
ఈప్రాంతంపై ప్రేమంటూ బాబు కల్లబొల్లి కబుర్లు
వంశధార, తోటపల్లి రిజర్వాయర్లతో ఆయనకేం సంబంధం..?
23 కేంద్ర సంస్థల్లో ఏ ఒక్కటీ తేలేదు మంత్ర ధర్మాన ఫైర్
వంశధార ప్రాజెక్టును డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నాం
ఉద్దానం సమస్యను పరిష్కరించిన ఘనత జగన్‌దే
రూ.4వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకా జరుగుతున్నాయి
ఉత్తరాంధ్ర ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : తేల్చిచెప్పిన మంత్రి ధర్మాన
ప్రసాదరావు
శ్రీకాకుళం : శ్రీకాకుళం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో మంత్రి ధర్మాన
ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల రూపకర్త
వైఎస్ఆర్.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రాంతాల అభివృద్ధి పట్ల పూర్తి
అవగాహన లోపించినట్లుంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా రావచ్చు. పర్యటించి
పరిశీలనలు కూడా చేయొచ్చు. కాకుంటే, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు
మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయనకు ఈ ప్రాంతం
పట్ల ప్రేమ ఉన్నట్లు ఈ ప్రభుత్వానికి లేనట్లు చిలుకపలుకులు పలికాడు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆనాడు జలయజ్ఞం పేరిట తోటపల్లి,
వంశధార, టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ తదితర మేజర్ ప్రాజెక్టులను ఆ మహానేత
ప్రారంభించారు.
14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదని బాబు అంగీకారం : చంద్రబాబు ఈరోజు
ఇక్కడకొచ్చి ప్రాజెక్టులు పూర్తికాలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన
చంద్రబాబునే తనకు తాను ప్రశ్నించుకున్నట్లు ఉంది. నువ్వు పూర్తిచేయాల్సిన
ప్రాజెక్టులను 4 ఏళ్ల కిందట వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిచేయలేదనడం
హాస్యాస్పదం కాదా..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసుకున్న 4 ఏళ్లల్లో రెండేళ్లు కోవిడ్
సంక్షోభం ఉంటే మరి, నువ్వు 1995లో ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నావన్న సంగతి
గుర్తుందా..?. ఈ ప్రాంతం పెద్ద ఎత్తున నీకు, నీ ప్రభుత్వానికి మద్ధతిచ్చి
ముఖ్యమంత్రిని చేసింది. 14 ఏళ్లపాటు ఈ ప్రాంతవాసుల ప్రేమతో నువ్వు
ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టావు. మరి, నువ్వు ఈ ప్రాంతవాసులపై
చూపించిన ప్రేమేంటి..? నీ నిర్లక్ష్యం, నీ అలసత్వాన్ని కప్పిపుచ్చుకుంటూ
ఇప్పుడు వై ఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిగ్గనిపించడంలేదా..?
అని ప్రశ్నిస్తున్నాను. అసలు, మీరేం చేశారు..? మేము ఈ ప్రాజెక్టు ప్రారంభించి
పూర్తిచేశామని ఏ ఒక్కదాన్నైనా చెప్పగలరా..? ప్రజలకు ఆ విధమైన సమాచారం
చెప్పుకోలేని మీరు కేవలం 4 ఏళ్ల ముందట పుట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని
ప్రాజెక్టులు కట్టలేదని.. నాశనం చేశారనడం వంటి చంద్రబాబు మాటలపై అందరికీ
ఆశ్చర్యం కలుగుతుంది.
వంశధారను డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నాం :
ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో 97 శాతం పనులు పూర్తిచేసుకుని, మిగతా 3
శాతాన్ని రేపు డిసెంబర్‌కల్లా పూర్తి చేస్తాం. విజయవంతంగా పూర్తయిన ఈ
ప్రాజెక్టు ను డిసెంబర్లో జాతికి అంకింతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి దీక్షగా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను
వెల్లడిస్తున్నాను.
వంశధార పూర్తి వెనుక జగన్ కృషి : ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైన ఈ
వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడానికి జరిగినటువంటి కృషిని ఈ సందర్భంగా నేను
వివరిస్తాను. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో దాదాపు 63 శాతం వంశధార
ప్రాజెక్టు పనులు పూర్తయితే.. ఆ తర్వాత ప్రభుత్వం కొంతపనులు పూర్తి చేస్తే..
బాబు 14 ఏళ్లహయాంలో కేవలం 23 శాతం పూర్తి చేశారు. అంటే, 14 ఏళ్లల్లో 23శాతం
పనులు చేసిన మీరొచ్చి మమ్మల్ని అడుగుతారా..? ఈ ప్రాజెక్టుకు 19 టీఎంసీల
రిజర్వాయర్ నింపడానికి నేరడి బ్యారేజీ వద్ద కట్టాల్సిన అదనపు బ్యారేజీని
ఒరిస్సాతో వివాదం ఉందని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రితో మాట్లాడటానికి అక్కడికి వెళ్లి సంప్రదింపులు జరపడం మీకు
తెలియదా..?. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం మరలా సుప్రీం కోర్టు వరకు వెళ్లి మరో
వివాదం తెచ్చింది. దీంతో రూ.2వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు
ముందుకు సాగదేమోనని గొట్టా బ్యారేజీ వద్దనే రూ.170 కోట్లతో మరో లిఫ్ట్
ఇరిగేషన్ ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చి టెండర్ ఖరారు చేసి పనులు
ప్రారంభించాము. గొట్టా బ్యారేజీ నుంచి 19 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి
రిజర్వాయర్‌ను నింపుకుందామని చేసిన ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డిది. మరో మూడునెలల్లో వంశధార ప్రాజెక్టు పనులన్నింటినీ
పూర్తిచేసి జాతికి అంకితం చేయబోతున్నాం.
వంశధారకు నువ్వు చేసిందేంటి..? : చంద్రబాబు ఒక విషయంపై సమాధానం చెప్పాలి. మీ
14 ఏళ్ల ఏలుబడి కాలంలో అనేక స్వార్థపూరిత ఆలోచనలకు కేటాయించిన సమయాన్ని ఈ
ప్రాంతంలో కీలకమైన వంశధార ప్రాజెక్టుకు కేటాయించారా..? ఒక్క శాతం కూడా
చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై శ్రద్ధచూపలేదు. ఎప్పుడో 1955లో శంకుస్థాపన జరిగిన
వంశధార ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో వివాదం ఉందని ఆ ప్రాజెక్టును నిలుపుదల
చేస్తే నీ 14 ఏళ్ల కాలంలో అటువైపు ఒక్కసారైనా తొంగిచూశావా..? ఒరిస్సా
ముఖ్యమంత్రితో ఏనాడైనా నువ్వు మాట్లాడావా..? లేదంటే, ఒక ట్రిబ్యునల్
వేయించుకుని సమస్యను పరిష్కరించుకున్నావా..? అంటే, ఏదీ చేయలేదు. మరి.. ఈ
నాలుగేళ్ల ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేస్తుందని ఎలా అనగలుతున్నావు
చంద్రబాబు..? అని మేము ప్రశ్నిస్తున్నాం.
ఉద్దానం సమస్యను పరిష్కరించిన మనసున్న నేత జగన్ : ఇక దేశంలో ఒక ప్రత్యేకమైన
సమస్యతో అట్టుడికిన ఉద్దానం ప్రాంతం గురించి మాట్లాడుకుంటే.. గ్రౌండ్‌వాటర్
తాగి కిడ్నీ జబ్బులతో ప్రజలు చనిపోతున్నారని రీసెర్చిలో తేలింది. ఈ చంద్రబాబు
14 ఏళ్ల హయాంలో ఒక్క పనిని కూడా ఉద్దానం ప్రజల కోసం చేయలేదు. కిడ్నీ జబ్బుల
సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని బాబు సూచించలేదు. అదే మా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చాపురం, పలాసకు వెళ్లి
సమావేశాలు పెట్టి ఉద్దానం ప్రజల ఉపశమనానికి కొన్ని కార్యక్రమాలు చేయడం
జరిగింది. అక్కడి ప్రజలు గ్రౌండ్‌వాటర్ తాగకుండా ఏం చేయాలని ఆలోచించి
హిరమండలం వద్దనున్న బ్యారేజీ నుంచి పైపులైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత
ప్రజలందరికీ తాగునీరు ఇవ్వాలని రూ.700 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి
ట్రయల్‌రన్ కూడా పూర్తిచేసుకుని రేపోమాపో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
ఉద్ధానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం అద్భుతం కాదా..? : ఈ సందర్భంగా నేను
కూడా ప్రజలనుంచి ఒక సమాధానాన్ని కోరుతున్నాను. దశాబ్ధాలుగా అనేకమంది
ముఖ్యమంత్రుల కాలంలో పరిష్కారమవని ఒక సమస్యను ఒక ప్రభుత్వ కాలంలో అంటే, కేవలం
4 ఏళ్లకాలంలో పరిష్కరించి ప్రజలకు మేలు చేయడం అద్భుతం కాదా..? అని
గుర్తుచేస్తున్నాను. అంతేకాదు, ఉద్దానం సమస్యకు రెండుమూడు రకాల
పరిష్కారాలున్నాయి. అందులో ఒకటేమిటంటే.. ఉద్దానం ప్రజలకు ఇక కిడ్నీ వ్యాధులు
రాకుండా సర్ఫేస్ వాటర్‌ను పైపులైన్ల ద్వారా అందించడం. రెండోదేమిటంటే,
ఇప్పటికే కిడ్నీ వ్యాధి సోకి వైద్యం చేయించుకుంటూ.. ఏ పనిని చేసుకోలేని వారికి
నెలనెలా రూ.10వేలు ఆర్థికసాయం అందించి వారి పొట్టగడవడానికి ప్రభుత్వం తోడుగా
ఉంటుంది. ఇక మూడోదేమంటే, ఉద్దానంలోనే ఒక ఆస్పత్రిని నిర్మాణం చేయడం. రాబోయే
మూడు నాలుగు నెలల్లో ఆ ఆస్పత్రి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. నాల్గోదేమంటే,
రీసెర్చి సెంటర్‌ను పూర్తిచేసి అక్కడికి వైద్యులను, ఇతర సిబ్బందిని విధుల్లోకి
తెచ్చేందుకు నియమిస్తున్నాం. వాటికి సంబంధించిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు
చేశాం.
-ఉద్దానం ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాది. ఒక
సమస్యకు కేవలం 4ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ఏ
ఒక్క మీడియాలోనూ ఒక్క వార్త కనిపించకపోవడం చాలా దారుణం. ఇదికదా.. ఒక ప్రభుత్వం
తాలూకూ పనితనం. ఇదికదా.. ఒక ప్రభుత్వపనితీరుకు అద్దంపట్టే వాస్తవమని ప్రజలకు
నేను గుర్తుచేస్తున్నాను. ఈ జిల్లాలోనే కాదు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఒక సమస్యపై
14 ఏళ్లకాలంలో చంద్రబాబు ఒక్క సమస్య అయినా పరిష్కరిండాడని ఆయన చెప్పగలరా..?
శ్రీకాకుళంలో ఒక్క కేంద్ర సంస్థనైనా పెట్టలేదేం బాబూ..? ః
రాష్ట్రవిభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రరాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు 23
పెద్ద సంస్థలను కేంద్రప్రభుత్వం ఇస్తే.. 13 జిల్లాలుంటే.. శ్రీకాకుళంలో ఏ ఒక్క
సంస్థనూ చంద్రబాబు పెట్టలేదు కదా..?. దీన్నిబట్టి ఉత్తరాంధ్ర వాసులు మీ పాలనను
ఎలా అర్ధం చేసుకోవాలి. ఇప్పుడొచ్చి ఈ ప్రాంతం పట్ల నాకు ప్రేముందని చంద్రబాబు
ఎలా చెబుతారు..? అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు సమానంగా పంచితే
రెండు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రకు రావాలి కదా..? ఎందుకు తేలేకపోయారు..?
అబద్ధాలకైనా ఒక అంతుండాలని.. కన్నార్పకుండా అబద్ధాలాడటం చంద్రబాబుకే సాధ్యమని
ఆయన సాహసాన్ని నేను మెచ్చుకోలేకపోతున్నాను. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన
వ్యక్తే ఈ చంద్రబాబు అని మరోమారు నేను గుర్తుచేస్తున్నాను.
టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ గురించి చంద్రబాబు మాట్లాడటంలో అర్ధంలేదు.
అసలు, ఆ ప్రాజెక్టుతో ఆయనకు సంబంధమేలేదు. ఆఫ్ షోర్ ప్రాజెక్టును మహానేత
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకొచ్చాక
దాన్ని ఆపేశారు. ఆ తర్వాత జగన్‌గారు వచ్చి ల్యాండ్ అక్విజేషన్ చేసి,
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసి రూ.700 కోట్లతో ప్రాజెక్టుకు శాంక్షన్
ఇచ్చి పనులు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే 20శాతం
పూర్తయ్యాయి.
తోటపల్లిలో బాబు పాత్రేమీ లేదుః
తోటపల్లి రిజర్వాయర్‌కు 2004లో బాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినా
పైసా ఖర్చుపెట్టలేదు. అప్పట్నుంచి 2014లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు
కేవలం 10 శాతం పనులే చేశారు. అంతకుముందే, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి
హయాంలో 90శాతం ప్రాజెక్టు పనుల్ని పూర్తిచేశారు. కాబట్టి, తోటపల్లి పూర్తిలో
బాబు పాత్రేమీలేదని స్పష్టంచేస్తున్నాను. అన్నీ నేనే చేశానని ఆపాదించుకోవడం
వలన ఏం ప్రయోజనం పొందుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను.
రూ.4వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకాః
ఉత్తరాంధ్ర ప్రాంతంలో రూ.4వేల కోట్లతో ఒక పోర్టు ప్రాజెక్టుకు శంకుస్థాపన
చేస్తే అందరూ అవహేళన చేశారు. ఈరోజు ఎవరైనా చూడండి.. మూలపేట, విష్ణుచక్రం
ప్రాంతంలో పోర్టు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి. స్వాతంత్య్రం
వచ్చాక ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులును శ్రీకాకుళం జిల్లాకు
తెచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.
అలాగే, అక్కడ్నే మరో రూ.400 కోట్లత ఫిష్షింగ్ హార్బర్‌ను కూడా ప్రారంభించి
పనులు చేయిస్తున్నాం. మంచినీళ్లపేట దగ్గర ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ పనులు
చేస్తున్నాం.
– ఇవాళ మా పాలనతో కింది స్థాయిలో అవినీతి లేకుండా చేశాం. కానీ మీరు అవినీతిని
ప్రోత్సహించారు. మీరు కూడా అవినీతిని నియంత్రించలేం అని ఒప్పుకున్నారు. ఇవాళ
గౌరవంగా చెప్పుకునే స్థితికి వ్యవస్థలను తీసుకువచ్చాం. పాలనలో
సంస్కరణలు తీసుకు వచ్చాం. పరిపాలన వికేంద్రీకరణను తీసుకుని వచ్చాం.
ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయంపై మీకు సదభిప్రాయమే లేదు.
– బలహీనవర్గాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడే తప్ప..
బలహీనవర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు.
– మంత్రివర్గంలో ఏనాడైనా బ్యాక్వర్డ్ క్లాసులకు ప్రాధాన్యం ఇచ్చారా..?
పరిపాలనలో ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా..? ఎలా బలహీనవర్గాలను
ఆదుకున్నానని చెప్పలగవు చంద్రబాబూ..?
– రూ.150 కోట్లతో నాగావళి నది వద్ద బ్యూటిఫికేషన్ చేశానని చంద్రబాబు
చెబుతున్నాడు.. అది ఎక్కడుందో ఎవరైనా చూపించగలరా..? దయచేసి చంద్రబాబు విధ్వంసం
అనే మాటను ఉపసంహరించుకొని, శ్రీకాకుళం ప్రాంతానికి ఏదీ చేయలేదని ఒప్పుకొని
సిగ్గుపడాల్సిన అవసరం ఉంది.
బాబూ.. విమర్శల్ని వెనక్కితీసుకో..ః
వీటన్నింటిని ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
చేస్తుంటే ఈ చంద్రబాబు మాత్రం నోరుతెరిస్తే అబద్ధాల పుట్టగా కనిపిస్తున్నారు.
ఉత్తరాంధ్రపై ఇంత ప్రేమ కురిపిస్తోన్న మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారిని
పట్టుకుని ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకుని.. ప్రాజెక్టుల్ని ఈ
ప్రభుత్వం నాశనం చేస్తుందనే నీ అసత్యపు విమర్శల్ని వెనక్కి తీసుకోవాలని
డిమాండ్ చేస్తున్నాను. ఇదేవిధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై
నోరుపారేసుకుంటానంటే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకుంటావని
బాబును హెచ్చరిస్తున్నానన్నారు.