విజయవాడ : వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ 59వ జన్మదిన
వేడుకలు శుక్రవారం భవానీపురంలోని ఆకుల శ్రీనివాస్ కార్యాలయంలో ఆయన అభిమానులు,
సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. ఆకుల పుట్టినరోజు వేడుకల్లో పలువురు వైసీపీ
నాయకులు, కార్యకర్తలు, ఆకుల అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు. ఆకుల శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి
అభినందించారు. వారందరి ఆనందోత్సవాల మధ్య ఆకుల శ్రీనివాస్ భారీ కేక్ కట్
చేశారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చేస్తున్న ప్రజా సేవా
కార్యక్రమాల్లో ఎల్లవేళలా తన వెంట ఉంటున్న అభిమానులు, సన్నిహితులకు,
కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కు
చెందినవారు తనను అభిమానించడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. గత 40
ఏళ్లుగా తాను చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాల స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా
ప్రజాసేవ కార్యక్రమాలకు పునరంకితం అవుతున్నట్లు ఆకుల ప్రకటించారు. సీఎం జగనన్న
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా తన వంతు కృషి చేస్తానని
ప్రకటించారు. ఆకుల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో 40 వ డివిజన్ కార్పొరేటర్
యరడ్ల ఆంజనేయ రెడ్డి, నాయకులు వడ్లాని మాధవరావు, ఏలూరు వెంకన్న,బొమ్ము మధు,
కొరగంజి భాను, లింగిపల్లి రామకృష్ణ,అల్లం పూర్ణచంద్రరావు, పొదిలి చంటిబాబు,
యరజర్ల మురళి, కర్రి గౌరి, సూరసాని రామిరెడ్డి,సలీం ఫర్వేజ్, సాంబయ్య, దూబ
తిరుపతి నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆకుల అభిమానులు, వైసిపి
కార్యకర్తలు పాల్గొన్నారు.