జనసేన నేత నాగబాబు
అమరావతి : ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం..అందరం కలిసి అడుగులు వేస్తే
ఓడించడం కష్టం కాదని జనసేన నేత నాగబాబు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని
పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీనియర్లు, యువత కలిసి కార్యక్రమాలు
చేయాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయాలని
పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. 2014లో
జనం కోసం, రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా మద్దతుగా నిలిచారు. ఏ
పార్టీకి లేని యువ బలం జనసేనకు ఉంది. ఏది సాధించాలన్నా యువతతోనే సాధ్యం. మనం
ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం. కాబట్టీ అందరూ కలిసి అడుగులు వేస్తే
ఓడించడం కష్టం కాదు. గతంలో ఒక వ్యక్తి కోసం ఓటు వేశారు..తరువాత తండ్రిని చూసి
కొడుక్కి ఓటు వేశారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు చూసి పవన్ కల్యాణ్‌కి ఓటు
వేయండి. సినీ రంగంలో చిరంజీవి, రాజకీయ రంగంలో పవన్ కల్యాణ్‌ను కోట్లాది మంది
ఆరాధిస్తున్నారు. అటువంటి కొడుకులకు జన్మనిచ్చిన తల్లిగా నువ్వు గొప్ప. మా
అమ్మతో నేను, అన్నయ్య.. తమ్ముడి గురించి ఇదే చెప్పాం అని నాగబాబు వివరించారు.