గుంటూరు : సంక్షేమంలో సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారని ప్రభుత్వ
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ
ఏపీలో అమలవుతోందని, ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పాలన అందుతోందన్నారు.
గురువారం తాడేపల్లిలో ప్రెస్మీట్ నిర్వహించిన సజ్జల మాట్లాడుతూ సంక్షేమంలో
సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు
అందేలా చూస్తున్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లేలా పాలన చేస్తున్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలో కోటి 46 లక్షల కుటుంబాలను
కలిశాం. అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు. సచివాలయ, వలంటీర్ వ్వవస్థ
ద్వారా ఇంటికే సంక్షేమ ఫలాలు. పటిష్టమైన వ్యవస్థ వల్లే ప్రజా సమస్యలకు
పరిష్కారం. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నాం. వరద
బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోంది. చంద్రబాబులా మా ప్రభుత్వం హడావుడి చేయదు.
బాధితులకు నేరుగా సాయం అందిస్తున్నాం. అమరావతి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం.
చంద్రబాబులా మా ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదని పేర్కొన్నారు.