విజయవాడ : ప్రత్యామ్నాయం రాజకీయ శక్తి గా దళితులు ఎదగాలని దళిత బహుజన పార్టీ
జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ
ప్రెస్ క్లబ్ లో జరిగిన పార్టీ ఏపీ రాష్ట్రజనరల్ కౌన్సిల్ సభ ను ప్రొఫెసర్
డాక్టర్. వి. ఎల్. రాజు ప్రారంభించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించ్చారు. పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రధాన వ్యక్త గా పాల్గొని
ప్రశoగించారు. రాష్ట్రo లో దోపిడీ కులాలు పాలన లో దళితులకు సామాజిక న్యాయం
లేదని, రక్షణ ఉండదని, అన్యాయమే జరిగిందన్నారు. రాజ్యాంగం ను అమలు చేసుకోవాలంటే
దళిత బహుజన జాతులు పొలిటికల్ పవర్ రావాలని, దళిత సీఎం పదవిని
సాధించుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం పదవిని దళిత జాతి సాధించికోకపోతే
భవిష్యత్ లేదని, జాతికి బానిసత్వం తప్పదన్నారు. రాజ్యాధికారం సాధన ద్వారా నే
విముక్తి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ అభ్యుర్థులకు ఓటు
వేసి అంబేద్కర్ వాదులను చట్టసభ లకు పంపించాలన్నారు. మూడు ప్రధాన అగ్రకుల
దోపిడీ కులాల రాజకీయాలని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టీ
రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
వారధి యాకోబు. రాష్ట్ర ప్రధాన కార్య దర్శి షేక్ జిలాని.రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుమ్మడి మహాలక్ష్మి,
మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి ఈశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నెలబాలుడు
తదితరులు పాల్గొన్నారు.