విజయవాడ : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర
అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి , పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన
వెంకట మహేష్ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా పోతిన మహేష్
మాట్లాడుతూ జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, దేశ రాజకీయాల్లో ఒక
సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి అని అన్నారు. బ్రిటిషర్స్ 1935 భారత
ప్రభుత్వ చట్టాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ‘ఆల్ ఇండియా అణగారిన వర్గాల
సమాఖ్య’ను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యపరచి
కార్యాచరణకై ఉద్యమించారాన్నారు. దేశ రక్షణశాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ
ఆదర్శనీయమేనన్నారు. ,దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు
వ్యక్తులకు మాత్రమే దక్కిందనీ ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్
అని తెలిపారు, నేటి రాజకీయ నాయకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పరిపాలన
కొనసాగించాలని మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్నా
శివశంకర్ 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ నగర సహాయ కార్యదర్శి
సాబిన్కర్ నరేష్, సుఖాసి భాను, ఎర్ర నగేష్, చలమల శెట్టి శ్రీనివాస్ రావు, సోమీ
మహేష్ తదితరులు పాల్గొన్నారు.