విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్, సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అత్యున్నత్తమైన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్, సీఎం జగన్, వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించింది.
రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా వివిధ రంగాల్లో గొప్ప పనులు చేసిన వారికి అవార్డులు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అవార్డులు అందించారు. సంస్కృతి సంప్రదాయాలు, వ్యవసాయం, మహిళా రక్షణ, వైద్యారోగ్య రంగం, పారిశ్రామికంగా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన వారికి వెనుకబాటు, అణచివేత మీద పోరాటం చేస్తున్న వారికి ఇస్తున్నామని జగన్ తెలిపారు. అసామాన్య సేవలు అందించే వారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సామాన్యుల నుంచి అసామాన్య వ్యక్తులను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అందిస్తున్నాం. 20 మందికి లైఫ్‌టైమ్ అవార్డులు, 10 మందికి అచీవ్మెంట్ అవార్డులు అందిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధికి వివిధ రంగాల్లో గొప్ప పనులు చేసిన వారికి అవార్డులు ఇస్తున్నాం. అసామాన్య సేవలు అందించేవారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.