దేశానికే అన్నం పెట్టే అన్నదాత బావుంటేనే దేశం బావుంటుందంటారు. అటువంటి రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండగా నిలిచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపడుతోంది. రైతన్నలు వ్యవసాయంలో బీమా కంపెనీల నుంచి ఏదైనా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు లేదా పంట నష్టానికి సంబంధించిన పరిహారం పొందేందుకు ఇ-క్రాప్ బుకింగ్ నమోదు తప్పనిసరి.
ఈ విభాగంలో రాష్ట్రంలోనే శ్రీ సత్యసాయి జిల్లా ఈ-క్రాప్ బుకింగ్, ఈ కెవైసీ నమోదులో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాధారణ పంట విస్తీర్ణంలో 97% ఎకరాలకు ఈ క్రాప్ నమోదు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 2,73,416 మంది రైతులు ఖరిఫ్ పంటను సాగు చేయగా వారిలో 2,63,795 మంది రైతులకు సంబంధించిన నమోదును అధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 8,07,730 ఎకరాల విస్తీర్ణం ఉండగా 7,86,567 ఎకరాలకు (97%) ఇ-క్రాప్ బుకింగ్ నమోదు పూర్తయింది. అలాగే అనంతపురం జిల్లాలో మొత్తం 12,54,971 ఎకరాలు సాగు చేస్తున్న 3,35,400 మంది రైతుల్లో 3,23,126 మంది రైతుల ఈ-కేవైసీ పూర్తి చేయగా, 12,15,047 ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. 8, 9 స్థానాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాలు నిలిచాయి.కాగా, కాకినాడ, గుంటూరు జిల్లాలు 82 శాతం సాగు విస్తీర్ణం తో 25,26 స్థానాల్లో నిలవడం విశేషం.