అమరావతి : జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది
లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 87.32
కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు
అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద
అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నగదు జమ
చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో
నగదు జమ చేశారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల
కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా
రూ.125.50 కోట్లు జమ చేసింది.ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి
ఉండాలని నిబంధన తీసుకొచ్చాం. ఈ క్రమంలో కనీసం పదో తరగతి అయిన పేద పిల్లలు
చదువుకుంటారు. టెన్త్ కచ్చితంగా చదివి ఉంటేనే కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం
అందుతుంది. ఇలా, టెన్త్ చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో మొదలవుతుంది. ఈ
పథకాలకు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించాం. ఈ
కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరామ్, కే.వి.ఉషాశ్రీ
చరణ్, బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాల
స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ఎఎండీ.ఇంతియాజ్,
సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కే.విజయ, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్
లక్ష్మిషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.