ముస్లింలను మోసం చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు
వారు గెలిచిన డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని మేయర్ పై స్పందనలో ఫిర్యాదు
చేస్తాం
పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల తరఫున పోరాటం చేసింది జనసేన పార్టీ
మాత్రమే
మైనార్టీల పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం
జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ : ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని జనసేన పార్టీ అధికార
ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ
నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన
జనసేన ప్రభుత్వo 26 వ రోజు కార్యక్రమం 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ షర్మిల
అమీర్ భాష ఆధ్వర్యంలో కలరా హాస్పిటల్ వద్దనుండి ప్రారంభించి 46వ డివిజన్ లోని
కొండ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి
రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 46 డివిజన్ లోని కలరా
హాస్పిటల్ వద్ద నుంచి కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి
వెళ్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని ఎందుకు ఓటేసామని వైసీపీ
ప్రభుత్వానికి ఓటేసి మా జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకున్నామని రాబోయే
రోజుల్లో మేము ఇటువంటి పొరపాట్లు చేయమని వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి
పంపించేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగిందని పర్యటించిన ప్రాంతంలో
ఎక్కువ మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారని వారందరూ మాకు పనులు లేక తీవ్ర
ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
పశ్చిమ నియోజకవర్గం లో ముస్లిం మైనార్టీలను దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తి
వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవానికి కూడా ఆయన
కృషి చేయలేదని, అనేక సందర్భాల్లో ధర్నాలు , దీక్షలు చేసాం ముఖ్యమంత్రి పర్యటన
కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి మూసాఫిర్ ఖానాను కేవలం 5000 రూపాయలకే పేద
ముస్లింకి అందించాలని మేము డిమాండ్ చేస్తే వైసిపి ముస్లిం నాయకులు గాని,
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గాని ఇంతవరకు సానుకూలమైన నిర్ణయం
తీసుకురాలేకపోయారంటే పేద ముస్లింలకు ద్రోహం చేసినట్టే కదా అని? అన్నారు.
అస్లాం కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే అది మర్డర్ అని అనేక
సందర్భాల్లో పోరాటం చేసి రెండుసార్లు పోలీసు విచారణకు కూడా ఎదుర్కోవడం
జరిగిందని, చివరికి అది మర్డర్ అని తేలిందని, వెల్లంపల్లి శ్రీనివాసరావు కి
డబ్బులు ఇస్తే నోరు మూత పడిపోతుందని, అన్యాయాలకు అక్రమాలకు అవినీతికి మద్దతు
ఇచ్చే వ్యక్తి అని గాలిబ్ షాహి దర్గా భూములు కబ్జా చేసినటువంటి దుర్మార్గపు
వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఆయన మిత్రుల చెరలో పెద్ద ఎత్తున భూములు
ఉన్నాయని, అవన్నీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హాజ్ హౌస్ పశ్చిమ నియోజకవర్గం నుండి గన్నవరం తరలి వెళ్ళిపోతే వెల్లంపల్లి
మౌనంగా ఉన్నారంటే అసమర్థుడు కాక ఇంకేమంటారని, దుకాణ్ మకాన్ పథకం కింద ఒక్కరి
కూడా లోన్ ఇప్పించలేకపోయారని, పెళ్లి కానుక కింద ఒక్క ముస్లిం మైనార్టీలను
కూడా ఎంపిక చేయలేదని వీటి గురించి ఎవరు నోరుమెదపరని మేము బలంగా పోరాటం చేస్తే
మాత్రం మా మీద విమర్శలు చేయడానికి ముందు ఉంటారని, పశ్చిమ నియోజకవర్గం
అభివృద్ధిలో సున్నా అని అవినీతి మాత్రం 100శాతం జరిగిందని, అడుగు అడుగున
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, అతని మిత్రులు, వైసీపీ నాయకులు
అడ్డగోలుగా దోచుకున్నారని ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో బహిర్గతం చేశానని,
అవన్నీ కూడా వాస్తవం అని తేలాయన్నారు.
డివిజన్ అధ్యక్షురాలు షర్మిల అమీర్ భాష మాట్లాడుతూ ఈరోజు 46వ డివిజన్లో జనసేన
పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం
జరిగిందని, మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్తుంటే కొండ ప్రాంతంలోనే ప్రజలు మెట్లు
సరిగా లేవని త్రాగునీరు సరిగా రావడం లేదని, రిటైనింగ్ వాల్ లేక కొండపై నుంచి
రాళ్లు ఇళ్లమీద పడుతున్నాయని, ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలు మెట్లు సరిగా లేక
ఎక్కలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అలాగే ఈ డివిజన్లో ఉన్న మేయర్
మా సమస్యలను పట్టించుకోవడంలేదని, మేయర్ డివిజన్లోని సమస్యలు పరిష్కారం
చేయాలని స్పందనలో మేయర్ కే ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. వైసీపీ
ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మోసపోయామని, ఈసారి మేము మోసపోమని, ఖచ్చితంగా
డివిజన్లోని అన్ని సమస్యల మీద పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. పశ్చిమ
నియోజకవర్గంలో ముస్లింల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పోతిన మహేష్ అని
ముఖ్యంగా రంజాన్ మాసంలో పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వటం
గాని అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే
ఆయన పోతిన మహేష్ అని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా విజయం
సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శిరం శీను బాబు, బాదర్ల
శివ, బుద్ధన ప్రసాద్, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, బి . మోహనరావు కరీముల్లా,
బెవర లోకేష్, వడ్డాది రాజేష్ , డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు
సాయి శరత్, సిగానంశెట్టి రాము , ఆకుల రవిశంకర్, నల్లబిల్లి కానకారావు, జగడం
శ్రీనివాస్, సబిన్కర్ నరేష్, , తొత్తడి భరత్, రజిని, పోలిశెట్టి శివ, తదితరులు
పాల్గొన్నారు.