మాజీ డిప్యూటీ సిఎం, పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో
సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి
త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల
ఆర్థిక సాయాన్ని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు.
శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ డిప్యూటీ
సిఎం, పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హజరయ్యారు. కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ శ్రికేశ్ లత్కర్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే రెడ్డి
శాంతి, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, సుడ చైర్ పర్సన్ కోరాడ ఆశాలత
గుప్తా, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అందవరపు సూరిబాబు, డిఆర్డిఏ పిడి
విద్యాసాగర్, ఏపీడి వాసుదేవరావు తదితరులున్నారు.