ప్రతి ఒక్కరు కనీసం డిగ్రీ వరకు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
12,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల జమ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి
గుంటూరు : పేదరిక నిర్మూలనకు చదువే దివ్యాస్త్రమని విశ్వసించి ప్రతి సంక్షేమ
పథకాన్ని చదువుతో ముడిపెడుతున్నట్టు సిఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీలో
12,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులను ముఖ్యమంత్రి క్యాంపు
కార్యాలయం నుంచి విడుదల చేశారు. లబ్దిదారులకు రూ.87.32కోట్ల రుపాయల నిధులను
పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. పథకాల
ద్వారా ఆర్ధికంగా ఆదుకోవడం కాకుండా, పథకాలను అందుకోడానికి పదో తరగతి ఖచ్చితంగా
చదివి ఉండాలనే నిబంధన అమలు చేస్తున్నట్లు సిఎం చెప్పారు. పది చదివిన వారికి
మాత్రమే షాదీతోఫా, కళ్యాణమస్తు ద్వారా ఊరట లభిస్తుందని స్పష్టం చేసినట్లు సిఎం
తెలిపారు. కనీసం పదో తరగతి వరకైనా చదివించాలనే ఆలోచన ప్రతి పేదకుటుంబంలో
వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిబంధన పెట్టినట్టు చెప్పారు. యువతులకు 18, యువకులకు
21 వయసు నిబంధన పెట్టడం ద్వారా, పెళ్లి చేయడానికి కనీసం 18ఏళ్లు ఆగుతారనే
ఆలోచన చేశామన్నారు. 15ఏళ్లు నిండాక 18ఏళ్లు వరకు ఆగాల్సి ఉండటంతో కనీసం ఇంటర్
చదివిస్తారని అంచనా వేశామన్నారు. విద్యార్ధులకు ఒకటి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి
ఉన్నందున, పది పూర్తయ్యాక ఇంటర్లో చేరుస్తారని, వారికి అమ్మఒడి పథకం వారికి
ప్రోత్సాహకంగా నిలుస్తుందని, ఇంటర్ తర్వాత జగన్ విద్యా దీవెన ద్వారా పూర్తి
ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రులకు ఎలాంటి భారం
ఉండదని, దీంతో పాటు వసతి దీవెన ద్వారా రూ.20వేల వరకు తల్లుల ఖాతాలకు జమ
చేస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ల లోపు ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరుతారని,
ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేయడానికి వీలవుతుందన్నారు. ఆ తర్వాత కూడా
చదువు కొనసాగించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని సిఎం చెప్పారు. ప్రతి
ఒక్కరు కనీసం డిగ్రీ వరకు చదవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి
వివరించారు. విద్యను ప్రోత్సహించడానికి జగనన్న అమ్మఒడి మొదటి బెంచ్ మార్క్‌గా
ఉంటే, విద్యా దీవెన , వసతి దీవెన రెండో బెంచ్ మార్క్‌గా ఉన్నాయని, కళ్యాణ
మస్తు, షాదీ తోఫా మూడో బెంచ్ మార్కుగా నిలుస్తుందన్నారు. ప్రతి తల్లి తమ
పిల్లల్ని డిగ్రీ వరకు చదివించడానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
పేదరిక నిర్మూలనకు చదువు మాత్రమే ఏకైక మార్గమని సిఎం చెప్పారు.
చదువుకుంటేనే మెరుగైన జీవితం పిల్లలకు లభిస్తుందనే నమ్మకంతోనే ప్రభుత్వం ప్రతి
అడుగు ఆ వైపు వేస్తున్నట్లు చెప్పారు. కళ్యాణమస్తు పథకం అందుకుంటున్న
12,132మందిలో 5920 జంటలు ” జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను
అందుకున్నారని సిఎం చెప్పారు. ప్రభుత్వ సాయం అందుకుంటున్న వారిలో 5920మంది
డిగ్రీ చదువుతున్న వారైనా అయ్యుండాలని, డిగ్రీ చదువుతున్న వారైనా ఉన్నారని
చెప్పారు.
ప్రభుత్వ సాయం అంతదుకునే వారు మంచి చదువులతో పేదరికం నుంచి బయటపడాలని
అకాంక్షను సిఎం వ్యక్తం చేశారు. గతంలో పథకం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు
వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు అమలు చేసి తర్వాత ఆపేశారని, తాము
మాత్రం చిత్తశుద్ధితో మనసుపెట్టి అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో
17,709మంది జంటలకు రూ.70కోట్లు ఎగ్గొట్టి వెళ్లిందని ఆరోపించారు. గతంలో కంటే
మెరుగ్గా పథకాన్ని అమలు చేయడానికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరింత మెరుగైన
సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
గతంలో ఎస్సీలకు అందించిన సాయాన్ని రూ.40వేల నుంచి లక్షకు పెంచామన్నారు.
ఎస్టీలకు రూ.50వేల నుంచి లక్షకు సాయం పెంచామన్నారు. బీసీలకు రూ.35వేల
చెల్లిస్తే దానిని రూ.50వేలకు పెంచామని చెప్పారు. మైనార్టీలకు రూ.50వేల
సాయాన్ని లక్షకు సాయం పెంచామని ప్రకటించారు. విభిన్న ప్రతిభవంతులైన జంటలకు
రూ.లక్ష రుపాయల సాయాన్ని లక్షన్నరకు పెంచినట్లు తెలిపారు.
ప్రతి పథకాన్ని చదువుకు ముడిపెట్టడం ద్వారా పేదరికం నుంచి బయటపడటానికి చదువే
దివ్యాస్త్రమని చెప్పడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకం అందుకుంటున్న వారికి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.