రూ.3820 కోట్లతో నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి
రూ.8500 కోట్ల ఖర్చుతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం
రాష్ట్రంలో 49 వేల మందికి పైగా వైద్య సిబ్బంది నియామకం
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇప్పటి వరకు 98 లక్షల మందికి వైద్య సేవలు
అందించాం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని
కర్నూలు : రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్య భరోసా కల్పించాలన్నది
ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని, అందులో భాగంగానే పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి
వరకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి
పెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
గురువారం కర్నూలు సర్వజన ఆస్పత్రి లో డయాగ్నొస్టిక్ బ్లాక్ కర్నూలు మెడికల్
కాలేజీ మహిళ పీజీ హాస్టల్ భవన నిర్మాణాల ప్రారంభోత్సవం, ప్రొఫెసర్లు, వివిధ
విభాగాల అధిపతుల తో సమావేశం అనంతరం మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు మెడికల్ హాస్పిటల్ లో రూ.12.90 కోట్లతో
డయాగ్నస్టిక్ బ్లాక్ ప్రారంభించామని, మూడు నెలల లోపల డయాగ్నస్టిక్ బ్లాక్లో
వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే నాడు నేడు కింద ప్రభుత్వ
ఆసుపత్రుల రూపురేఖలను మార్చడం జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 3820
కోట్లతో నాడు నేడు కింద ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.. ఇందులో
భాగంగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని రూ. 500 కోట్లతో అభివృద్ధి
చేస్తున్నామన్నారు.అలాగే 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ. 8500 కోట్లను
ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. పేదవాడికి పూర్తి స్థాయిలో అండగా ఉండేందుకు
ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రులతో పాటు వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కమ్యూనిటీ
హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్ లు, టేరిటరీ హాస్పిటల్స్ అభివృద్ధి
చేస్తున్నామని, మునుపెన్నడూ లేని విధంగా జీరో వేకెన్సి పాలసీ తో ముందుకు
వెళ్తూ, 49 వేలకు పైగా వైద్య, ఆరోగ్య రంగంలో నియామకాలు చేపట్టడం జరిగిందని
మంత్రి తెలిపారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండకూడదని
ముఖ్యమంత్రి ఈ దిశగా చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్
విధానం ద్వారా ఇప్పటివరకు 98 లక్షల మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని,
ఆరోగ్యశ్రీ కింద 3255 ప్రొసీజర్స్ తో పేద వాడికి ఆరోగ్య భరోసా
కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.