1.66 లక్షల హెక్టార్లలో సాగుకు చర్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి : రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మరింత
ప్రోత్సాహం అందిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆయన పలు
అంశాలు వెల్లడించారు.ఈ ఏడాది 1.66 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాల పంటలను
విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సాహించడం ద్వారా ప్రభుత్వం 4.11 లక్షల మెట్రిక్
టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తుందని అన్నారు. ఈ పంటలను పౌరసరఫరాల సంస్థ ద్వారా
కొనుగోలు చేయాలని నిర్ణయించిందని అందకు ప్రభుత్వం కనీస మద్దతు ధర
నిర్ధారించిందని అన్నారు.
నిషేదిత జాబితా నుంచి 33 వేల ఎకరాల భూములను విముక్తి
నిషేదిత జాబితా నుంచి 33 వేల ఎకరాల భూములను విముక్తి లభించిందని గత ప్రభుత్వం
నిషేదిత జాబితాలో చేర్చిన 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత
జాబితా నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించిందని విజయసాయిరెడ్డి
తెలిపారు. బ్రిటిష్ కాలంలో రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను 2016 లో గత
ప్రభుత్వం 22 ఏ కేటగిరీకి మార్పు చేసిందని, ఫలితంగా కొనుగోలు, అమ్మకాలు
నిలిచిపోయాయని అన్నారు. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం ఆ భూములకు నిషేదిత జాబితా నుంచి తొలగించి విముక్తి కల్పించిందని
అన్నారు. సీఎం జగన్ కు రుణపడి ఉంటామని పలువురు రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ
భావోద్వేగానికి గురయ్యారని అన్నారు.
ఏపీలో ఏర్పాటు కానున్న నాలుగు ఫుడ్ స్ట్రీట్ లు
శుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులు ప్రోత్సహించేందుకు దేశ వ్యాప్తంగా 100
ఫుడ్ స్ట్రీట్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు తాను పూర్తి మద్దత్తు
తెలుపుతున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 4
ఫుడ్ స్ట్రీట్ లు ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు. సురక్షితమైన ఆహార
పద్ధతులు పాటించడం ద్వారా పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
ఒక్కో ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత
ప్రాంతాలకు కోటి రూపాయలు ఆర్థిక సహకారం అందించనుందని అన్నారు. స్ట్రీట్
ఫుడ్స్ ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యం సురక్షితమైన ఆహారం
అందించనున్నట్లు తెలిపారు. అలాగే అనేక మందికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు.
“ఈట్ రైట్” క్యాంపెయిన్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.