సింహాచలం : చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూపాన్ని చూసేందుకు సింహాద్రి
అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కనీస సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి బస్సుల కొరతతో కొండ కింద పెద్ద సంఖ్యలో
భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా
వ్యవహరిస్తున్నారని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. అప్పన్న నిజరూప దర్శనం
కోసం బారులుతీరారు. దీంతో కనీస సౌకర్యాలు లేక క్యూలైన్లలో పిల్లలు, వృద్ధులు,
మహిళలు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు క్యూలైన్లో గంటలతరబడి
వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొండపైకి బస్సుల కొరతతో చందనోత్సవ భక్తులు
కొండ కింద ఎదురుచూపులు చూస్తున్నారు. సింహగిరి ఘాట్రోడ్డులో వాహన రాకపోకలు
స్తంభించాయి. బస్సులు నిలిచిపోవడంతో అనేక మంది భక్తుల నడిచి వెళ్తున్నారు.
వీఐపీ వాహనాలు భారీగా కొండపైకి చేరుకున్నాయి. దేవస్థానం సిబ్బంది, పోలీసులపై
భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణద్వారం నుంచి పోలీసులు దర్శనాలు
చేయిస్తున్నారని భక్తుల ఆరోపిస్తున్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బందితో
భక్తుల వాగ్వాదానికి దిగారు.1500 టికెట్ తీసుకున్న భక్తులకు రెండున్నర గంటలకు
పైగా సమయం పడుతుంది. క్యూలైన్లలో సుమారు 3 వేల మందికి పైగా రూ.1500 టికెట్
భక్తులు ఉన్నారు. దీంతో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. ప్రొటోకాల్ ఉన్నా
భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. విశాఖ మేయర్..హరివెంకట కుమారిని అధికారులు
పట్టించుకోలేదు. ఐఏఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్
జడ్జిలు, ఉన్నతాధికారులు సైతం గంటల తరబడి వేచిఉన్నారు.