పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్
విజయవాడ : బిఏ ఓరియెంటల్ లాంగ్వేజ్ (ఓ.ల్) పూర్తి చేసిన వారికి బీఈడీ లో
ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి
తీసుకున్న నిర్ణయాన్ని అంధ్ర సారస్వత పరిషత్ అభినందిస్తున్నదని పరిషత్
అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. బి.ఈడి సోషల్ స్టడీస్ మెథడాలజీలొకి
ప్రవేశం కల్పించేందుకు అనుమతులివ్వడం, అర్హత ఉన్న అభ్యర్థులకు ఏపిఎడ్ సెట్
దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగించడం , జూన్ మూడోవారం లో ఈ పరీక్షను
నిర్వహించడానికి సన్నాహాలు చేయడం హర్షణీయం అని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.
అంధ్ర సారస్వత పరిషత్ , ఓరియంటల్ విద్యార్థుల అభ్యర్థనను విని సానుకూలంగా
స్పందించిన ముఖ్యమంత్రిగా విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత
విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి, కమీషనర్ సురేష్ నాయర్, ఏపీఎడ్ సెట్
కన్వీనర్ సుధీర్ రెడ్డికి పరిషత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ నిర్ణయం వల్ల
ఓరియంటల్ విద్యార్థులకు ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగ అవకాశాలకు, తెలుగు భాషా
వికాసానికి తోడ్పడినట్లు అవుతుందని డా.గజల్ శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డప్ప
దవెజి అన్నారు.