పండుగ వాతావరణంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
వైఎస్సార్సీపీ శ్రేణులకు ఊరూరా ఆత్మీయ స్వాగతం
చంద్రబాబు చేసిన మోసాలను ఏకరవు పెడుతున్న జనం
సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మంచిని గుర్తు చేస్తున్న ప్రజలు
ప్రభుత్వానికి మద్దతుగా 75 లక్షల మిస్డ్ కాల్స్
విజయవాడ : ఇంటింటా ఘన స్వాగతాలు, ఆత్మీయ పలకరింపులు, జగన్నినాదాల మధ్య పండుగ
వాతావరణంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు,
సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారథులు లక్షలాది కుటుంబాలను కలుస్తూ
చరిత్ర సృష్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా ఈ కార్యక్రమానికి
విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు,
సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును ఇంటింటా వివరించి..
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని
తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ నెల 7న వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా ‘జగనన్నే
మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. టీడీపీ సర్కార్
హయాంలో చంద్రబాబు చేసిన మోసాలను.. ఆ పార్టీ నేతల అరాచకాలను వైఎస్సార్సీపీ
శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అప్పటి టీడీపీ
సర్కార్‌కూ ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరించే
కరపత్రాన్ని ప్రతి ఇంటా అందిస్తున్నారు.
*అందరి నోటా ఒకే నినాదం : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇంటికి
వస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, సచివాలయాల
కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారథులకు ఆ కుటుంబ సభ్యులు ఎదురేగి ఘన స్వాగతం
పలుకుతున్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన
చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేస్తే.. సీఎం వైఎస్ జగన్ 98.5
శాతానికిపైగా హామీలను అమలు చేశారని అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేస్తున్నారు.
డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు నాడు మోసం చేస్తే నేడు
సీఎం వైఎస్ జగన్ వాటిని చెల్లిస్తున్నారని అక్కచెల్లెమ్మలు
ప్రశంసిస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి
దీవెన వంటి పథకాల ద్వారా పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది.. వారి బంగారు
భవితకు సీఎం వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారని కొనియాడుతున్నారు.
నాడు అన్నీ అగచాట్లే. : చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు దుర్భిక్ష
పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయామని.. ఏనాడూ బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ
ఇచ్చి ఆదుకోలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి
వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని.. విత్తనం నుంచి విక్రయం దాకా
ఆర్బీకేల ద్వారా తోడునీడగా ఉంటున్నారని.. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు
చేస్తున్నారని.. ఏ సీజన్లోనైనా పంట నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్
సబ్సిడీ అందిస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ కోసం
జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ నాడు కాళ్లరిగేలా తిరిగినా,
లంచాలు ఇచ్చినా మంజూరు చేసేవారు కాదని అవ్వాతాతలు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎవరి చుట్టూ తిరగకుండానే పింఛన్ మంజూరు చేస్తున్నారని.. ప్రతి నెలా
ఒకటో తేదీన ఇంటి వద్దకే వలంటీర్లు వచ్చి పింఛన్ అందిస్తున్నారని
ప్రశంసిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ
నినదిస్తున్నారు. మెగా ప్రజా సర్వేకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన
లభిస్తోంది. ప్రజా మద్దతు పుస్తకంలో వారి అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు.
అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు
మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. 20వ తేదీ వరకు ఏకంగా 75 లక్షల కుటుంబాలు ఇలా
మిస్ట్ కాల్ ఇచ్చి మద్దతుగా నిలిచాయి. సీఎం వైఎస్ జగన్ మేలు చేస్తుండటం
వల్లే ప్రభుత్వానికి ప్రజల్లో నానాటికీ మద్దతు పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు.