గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్లను పది రోజుల్లో పూర్తి చేయండి
తిరుపతి గంగజాతరకి దేశం నలుమూలల నుంచి భక్తుల రాక
అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురండి
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును మేయర్ శిరీష,
కమిషనర్ హరిత, అధికారులతో గంగమ్మ ఆలయ ప్రాంగణం నుండి గాంధీ విగ్రహం కూడలి వరకు
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పనులు పరిశీలించారు. తిరుపతి
తాతయ్యగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును బుధవారం మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్
శ్రీమతి ,నగర పాలక అధికారులతో కలిసి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద
నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు సైడ్ కాలవలు, పెద్ద
కాలువలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి గంగజాతర అంగరంగ
వైభవంగా నిర్వహిస్తున్నామని, దేశం నలుమూలల నుండి భక్తులు విచ్చేయుచున్నారు.
అందుకు తాతయ్యగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును ఏప్రిల్ 30వ తేదీకి అందుబాటులోకి
తీసుకురావాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. మేయర్ శిరీష, కమిషనర్
హరిత మాట్లాడుతూ తిరుపతి తాతయ్య గుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రజలకి ఇబ్బంది
కలగకుండా నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను
ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సూపరింటెండెంట్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్,
ఎంహెచ్ఓ హరికృష్ణ, డి.ఈ.దేవిక, ఎ.సి.పి. బాలసుబ్రమణ్యం, పోలీసు అధికారులు,
కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జయచంద్ర రెడ్డి, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి
యాదవ్, ఈవో మునికృష్ణ, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దొడ్డ రెడ్డి సిద్ధారెడ్డి,
ఉదయ వంశీ, మునిశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, తులసి యాదవ్, భరణి యాదవ్, సురేష్,
రమేష్ మురళి, నగరపాలక ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.