– అద్యంతం హర్షాతిరేకాలుమూలపాడు/ సంతబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి
మండలం మూలపేట గ్రామం నుంచి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
చేశారు. ముందుగా ఆయన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో మూలపేటలో
రూ.4,361.91 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ సీ పోర్టు నిర్మాణం
కోసం గంగమ్మ తల్లికి పూజలు చేసి అనంతరం శంకుస్థాపన చేశారు. సంతబొమ్మాళి మండలం
కస్పా నౌపడలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకై 34.98 కోట్ల రూపాయలతో మూలపేట
ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అక్కడే ఎచ్చెర్ల
మండలం బుడగట్లపాలెంలో రూ. 365,81 కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్
నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం జలవనరుల
శాఖ ఆధ్వర్యంలో రూ. 176.35 కోట్ల రూపాయలతో బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు (గొట్టా
బ్యారేజ్)- హిరమండలం ఎత్తిపోతల పథకం నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. వీటితో
పాటు పలాస మండలం రేగులపాడు వద్ద రూ. 852.45 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్-షోర్
రిజర్వాయిర్ పనులను పునఃప్రారంభించారు. అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన
పైలాన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం,
జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ
అమర్నాథ్, జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, రెవెన్యూమంత్రి ధర్మాన
ప్రసాదరావు, పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు,
శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన
కృష్ణదాస్ (నరసన్నపేట), రెడ్డి శాంతి (పాతపట్నం), గొర్లె కిరణ్ కుమార్
(ఎచ్చెర్ల), ఎమ్మెల్సీ వరదు కల్యాణి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఏపీ
మారిటైమ్ బోర్డు చైర్మన్ కె వెంకటరెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సీలు
దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, పరిశ్రమలశాఖ ప్రత్యేక
ప్రధానకార్యదర్శి ఆర్ కరికాల వలవన్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి
శశిభూషణ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి కె ప్రవీణ్
కుమార్, ఆర్ ఆర్ శాఖ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా కలెక్టర్
శ్రీకేష్ బి లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక,
మూలపేట పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి టి ఎస్ ఎన్ మూర్తి, టెక్కలి సబ్
కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు ఉప ముఖ్య కార్య
నిర్వహణాధికారి బి. రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ బి.
రాజగోపాలరావు, ఏపీ మారిటైమ్ బోర్డు ఎస్ఇ జి వీరరాఘవరావు, ఏపీ మారిటైమ్ బోర్డు
ప్రత్యేక ఉప కలెక్టర్ ఎ.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం :
మూలపేట పోర్టు భూమిపూజ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం జిల్లాకు
విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా యంత్రాంగం, ప్రజా
ప్రతినిదులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాటకర్, ఎస్పీ
అర్.రాధిక, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు దంపతులు,
శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ ఘన స్వాగతం పలికారు. పిరియా సాయిరాజ్, ధర్మాన
కృష్ణ చైతన్య, ధర్మాన రామనోహర్ నాయుడు, కళింగ కార్పొరేషన్ చైర్పర్సన్ అందవరపు
సూరిబాబు, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, కలెక్టర్ టెక్కలి సబ్
కలెక్టర్ రాహుల్ కుమార్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. భారీ సంఖ్యలో
గ్రామస్తులు భూమి పూజ ప్రాంతానికి చేరుకుని జగన్ కు జేజేలు పలికారు.