కడపలో టీడీపీ జోనల్ మీటింగ్ కు హాజరైన చంద్రబాబు
సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, పరిటాల సునీత
చంద్రబాబుకు శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్
కడప : కడపలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జోన్-5 సమావేశం జరిగింది. టీడీపీ
జాతీయ అధినేత చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్-5 నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర ముఖ్య నేతలు
ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, తాడిపత్రి
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి కూడా
వచ్చారు. తండ్రీకొడుకులు వేదికపై చంద్రబాబుతో ఆత్మీయంగా ముచ్చటించడం
కనిపించింది. వారు చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు ఓ జ్ఞాపికను
కూడా బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు.
అంతకుముందు, సమావేశం ప్రారంభానికి ముందు చంద్రబాబు పార్టీ వ్యవస్థపాక
అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. కాగా, జోన్-5
సమావేశం అనంతరం కడపలో జరిగే ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం
బద్వేలు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.