సీఎం జగన్ కు వివరించిన ఆకుల శ్రీనివాస్
విజయవాడ : సీఎం జగనన్న ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో మంచి ఆదరణ
కనబడుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల
శ్రీనివాస్ కుమార్ చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్
విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డిని ఆకుల శ్రీనివాస్ కుమార్ విద్యాధరపురంలో కలిశారు. ఈ సందర్భంగా
ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ “నువ్వే మా
నమ్మకం” “మీరే మా భవిష్యత్”కార్యక్రమాల్లో విద్యార్థులు, కార్మికులు,
కర్షకులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, వారిలో ఈ
కార్యక్రమంల పట్ల మంచి స్పందన వస్తోందని తెలియ చేయడం జరిగింది. ఈ సందర్భంగా
సిఎం జగన్ మోహన్ రెడ్డి తన భుజం తట్టి గుడ్, అందరూ కష్టపడండి 175 సీట్లు
లక్ష్యంగా పని చేయాలని తనతో చెప్పారని ఆకుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇచ్చి నందుకు ముఖ్యమంత్రి కి ధన్య వాదాలు
చెప్పడం జరిగిందన్నారు.