సర్వే నిర్వహణలో ముందు వరుసలో సత్తెనపల్లి
ఈనెల 21న వడ్డెర సత్తెన్న విగ్రహావిష్కరణ
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి : దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా నాలుగు సంవత్సరాల
పరిపాలన తర్వాత, ఎన్నికలకు ఏడాదికాలం ఉండగా ప్రజా ప్రతినిధులను ప్రతి ఇంటికి
పంపించి ప్రభుత్వ సేవలపై ఆరా తీయించి, వారి అభిప్రాయాలు తెలుసుకునే భారీ
కార్యక్రమం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖా
మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమ సమీక్షలో ఆయన
పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ విద్య, వైద్య,
వ్యవసాయ రంగాల్లో సంస్కరణ లు ప్రవేశ పెట్టి ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన ఈ పరిపాలనతోనే నియోజకవర్గ స్థాయి నాయకులకు
ఆత్మస్థైర్యాన్ని కలిగించిందని, అందుకే ప్రశాంతంగా ప్రజల వద్దకు వెళుతున్నామని
మంత్రి అంబటి వివరించారు. గత నాలుగేళ్లలో 98 శాతం హామీలు అమలు చేసామని, 87శాతం
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని, 50శాతం పైగా ప్రజలు మనకు అనుకూలంగా
ఉన్నారని ఆయన వివరించారు.
జగనన్న మా భవిష్యత్తులో ముందు వరుసలో సత్తెనపల్లి
ఉమ్మడి జిల్లాలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహణలో సత్తెనపల్లి
నియోజకవర్గం ముందు వరుసలో ఉందని మంత్రి అంబటి తెలిపారు. ఈనెల 7వ తేదీ నుండి
మొదలైన ఈ కార్యక్రమం 20 తేది వరకు జరుగుతుందని ,అయితే పట్టణంలో కన్వీనర్లు,
ప్రజాప్రతినిధులు ,నాయకుల సమిష్టి కృషితో 18వ తేదీ కల్లా ముగుస్తుందని, వేగంగా
పూర్తిచేసిన నేతలను ఆయన అభినందించారు.
21వ తేదీన వడ్డెర సత్తెన్న విగ్రహావిష్కరణ
వడ్డెర వర్గానికి చెందిన సత్తెన్న విగ్రహ ఆవిష్కరణ ఈనెల 21వ తేదీన జరగనుంది, ఈ
ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులకు అంబటి పిలుపునిచ్చారు. ఈ
కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నూతన ఎమ్మెల్సీలు
యేసు రత్నం, మర్రి రాజశేఖర్ లు, ముఖ్య నాయకులు హాజరవుతారని ఆయన వివరించారు. ఈ
సమీక్ష కు మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు.
పల్నాడు జిల్లా వైద్య విభాగాం అధ్యక్షులు డా.గజ్జల నాగభూషణ్ రెడ్డి మాట్లాడారు
ఈ సమావేశంలో
వైస్ చైర్మన్ కోటేశ్వరరావు నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెండెం
బాబురావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, షేక్
మౌలాలి, కట్టా సాంబయ్య, మక్కెన అచ్చయ్య, పెద్దింటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు
గుజ్జర్లపూడి సతీష్ , శెట్టి ఆనంద్, నాయకులు సిరిగిరి వెంకటరావు, లోకామధవ్,
బండి మల్లిఖార్జున రెడ్డి, చుక్క మోషే, ఉన్నారు.