బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్
గుంటూరు : అసత్య వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజల్ని మోసగించి అధికారం
చేజిక్కించుకున్న వైసీపీ ప్రభుత్వ పాలనతో ప్రజానీకం విసిగి వేసారి పోయారని
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
పేర్కొన్నారు. సోమవారం తోట సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన తెలుగుదేశం,
వైసీపి , బిజెపి నాయకులు, కార్యకర్తలు భారాస పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా
డాక్టర్ తోట మాట్లాడుతూ అవినీతిమయమైన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు
బిఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు . ఏపీ సమగ్రాభివృద్దికి బిఆర్ఎస్ బాటలు
వేస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణాను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన భారాస
జాతీయ అధ్యక్షులు, తెలంగాణా సిఎం కేసిఆర్ నాయకత్వం వైపు ఏపీ ప్రజలు
ఆకర్షితులౌతున్నారన్నారు. వివిధ రాజకీయపార్టీలకు చెందిన నేతలు బిఆర్ఎస్ లోకి
చెరడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా బి ఆర్
ఎస్ లో చేరిన నేతలు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
భారాస లోకి చేరిన వారిలో టిడిపి కి చెందిన నేతలు వై . శ్రీకాంత్ బాబు
(తిరుపతి) కె . శ్రీనివాస రావు (కావలి) బి. ఆనంద్ బాబు (కావలి) కె . సురేష్
(కందుకూరు) ఎన్. శ్రీనివాసులు (గూడూరు), కిరణ్ (నెల్లూరు), వైసీపీ నేతలు ఏం వీ
ఎస్ రవీంద్ర బాబు (నెల్లూరు) కె .రూపేష్ కుమార్ ( నెల్లూరు), ఎస్ కె . నాయబ్
(ఉదయగిరి) ఎల్ . శ్రీనివాస్ రావు (తాడేపల్లి గూడెం), వి. శంకర్ (గుంటూరు)
ప్రసన్న కుమార్ రెడ్డి(నెల్లూరు), దాస్ (ఒంగోలు), బిజెపి నేతలు వి. ప్రసాద్
(నెల్లూరు రూరల్), శ్రీనివాసరావు (తాడేపల్లిగూడెం), డి.శ్రీనివాస రెడ్డి
(కాకినాడ), మహేందర్ యాదవ్, సి .రాజా, డి .అరుణ్ కుమార్, మల్లేష్
గుప్తాతదితరులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.