ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
విజయవాడ : సి.రాఘవాచారి ప్రెస్ అకాడమి, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ
సంయుక్తంగా ప్రవేశ పెట్టిన “ డిప్లమా ఇన్ జర్నలిజం” కోర్సు కు దరఖాస్తు
చేసేందుకు ఆఖరు తేదీని మరో 10 రోజులు పొడిగించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్
అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు తెలిపారు. ఏప్రిల్ 25 వరకు
దరఖాస్తులు పంపుకోవచ్చని, ఈ కోర్సుకు దరఖాస్తు కు చివరి తేదీ పొడిగించమని
విజ్ఞప్తులు అందుతున్న దృష్ట్యా ఏప్రిల్ 25 వరకు పొడిగిస్తూ
నిర్ణయంతీసుకున్నామని ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఆసక్తి
గల వారు అప్లికేషన్స్ పూర్తి చేసి పోస్ట్ ద్వారా పంపించగలరు. క్లాసులు మాత్రం
యధావిధిగా ‘మే’ నెల 1వ తేది నుంచి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. కోర్సుకు
సంబంధించిన మరిన్ని వివరాలకు 9154104393 మొబైల్ నంబర్ ని (ఉదయం 10 గంటల నుండి
సాయంత్రం 4 గంటల వరకు) సంప్రదించాలని కోరారు.