ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
గుంటూరు : గత చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకూ ఉన్న
తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్
అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏడు లక్షల మంది సైన్యం
అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు
సహకరిస్తున్నారని చెప్పారు. శనివారం మంత్రి జోగి జోగి రమేష్ మీడియా తో
మాట్లాడుతూ వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా సీఎంకు మద్దతు
తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇది ప్రభుత్వంపై
ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు.
పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో
పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారని కొనియాడారు.