దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్న బిజెపి * రాహుల్ సస్పెన్షన్ బిజెపి కుట్ర
* ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకాకినాడ : కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని
మతాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగురు
దుర్రాజు అన్నారు. కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం
దేశంలో ఉన్న అన్ని పరిశ్రమలు అమ్మేసి కార్పొరేట్లకు ఊడిగం చేసి దేశ సంపదను
వారికి దోచుకునేందుకు సహకరిస్తుందన్నారు. బుధవారం కాకినాడ ధర్నా చౌక్‌లో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు
ముఖ్యఅతిథిగా హాజరైన గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో
విపరీతమైన ఆదరణ వస్తుందని రాహుల్ గాంధీ సభలకు ప్రజలు విశేషంగా తరలిరావడంతో
బిజెపి కుట్ర పన్నిందన్నారు. యువ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపట్టి
అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల వారి మద్దతుతో సుమారు 4000 కిలోమీటర్లు
పాదయాత్ర చేశారని అది చూసిన బిజెపి వాళ్లకు వణుకు పుట్టడంతో కావాలనే అతనిని
పార్లమెంట్‌లోకి రానివ్వకుండా సస్పెన్షన్ చేశారన్నారు. ఆదాని, అంబానీలకు దేశ
సంపదను మోడీ అమ్మేస్తున్నాడని ఇది రాహుల్ ప్రశ్నించడం వల్లనే ఆయనను సస్పెండ్
చేశారన్నారు. ఇటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బిజెపి
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అవినీతిపై ప్రశ్నించిన వారిని
అక్రమాలను ఎదిరిస్తున్న వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసి వారిని
జైలులో పెట్టేందుకు అనవసర చట్టాలను ఉపయోగిస్తున్నారని బిజెపి తీరుపై గిడుగు
మండిపడ్డారు. దేశ సంపదను ఆదానికి అమ్మేస్తున్నారన్న యువనేత రాహుల్ గాంధీని,
మోదీ ఏం చదువుకున్నారని అడిగిన మరోకరకి రెండు రకాలుగా శిక్షలు విధించి దేశంలో
ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కినట్లు చెప్పారు. కేంద్ర మాజీమంత్రి ఎంఎం
పళ్లంరాజు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన పదేళ్ల కాలం నుంచి
అధికారంకు దూరంగా ఉన్నా ప్రజలలో నిత్యం ఉండి ప్రజా సమస్యలపై కేంద్ర
ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. దూరదృష్టిగల దేశ అభివృద్ధి కోసం
పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులను బిజెపి ప్రభుత్వం ఇరుకును పెట్టాలని కోవడం
మూర్ఖత్వమన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో దేశం సస్యశ్యామలంగా ఉందని
ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యువతకు కలిగేవన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు
మూసివేతతో ఉపాధి కోల్పోయి చిన్న, మధ్యతర పరిశ్రమలు మూలన పడ్డాయని చెప్పారు.
సత్యాగ్రహ దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ,
నాయకులు వర్మ, కామన ప్రభాకరరావు, మల్లిపూడి శ్రీరామ చంద్రమూర్తి, ఆకుల
వెంకటరమణ, ఓలేటి రాయ భాస్కరరావు, దాట్ల గాంధీ రాజు, పిట్టా అర్జున్, తదితరులు
పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు వామపక్ష నాయకులు
తాటిపాక మధు, ఎం.రాజశేఖర్, దువ్వ శేషుబాబు, పలువురు మద్దతు ప్రకటించారు.