జోతిష్య దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తంను అనుసరించి ముఖ్యమంత్రి అనుమతితో
108 కుండములు, 2 ప్రధాన కుండములతో రాష్ట్రములో గల 8 ఆగమములను అనుసరించి
రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర కళ్యాణం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంచే దేవాదాయ
ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహా
యజ్ఞం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,దేవాదాయ ధర్మాదాయ శాఖ
మాత్యులు కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఈ
మహా యజ్ఞం నిర్వహణ నిమిత్తం రెవెన్యూ (దేవాదాయ శాఖ) సెక్రటరీ,కమీషనరు, దేవాదాయ
ధర్మాదాయ శాఖ, యస్. సత్యనారాయణ, యన్.టి.ఆర్. జిల్లా కలెక్టరు, సిటీ పోలీసు
కమీషనరు, మున్సిపల్, ఫైర్, ఎలక్ట్రికల్, ఆర్.అండ్.బి,దేవాదాయ శాఖ
ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ మహా యజ్ఞం నకు వివిధ
డిపార్టుమెంట్లనుండి చేయవలసిన ఏర్పాట్లను చీఫ్ సెక్రటరీ క్యాంప్ కార్యాలయము
నందు సమీక్షించారు.21.3.2023 న ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ 3వ సమావేశంలో ధార్మిక పరిషత్
చైర్మన్, ఇతర సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన డైరెక్టర్, అర్చక
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రాష్ట్ర ప్రభుత్వం చే ఇటీవల ఏర్పాటు చేయబడిన ఆగమ
సలహా మండలి సభ్యుల తీర్మానమును అనుసరించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంపద,
ఆరోగ్యం, పాడిపంటల వృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో
ఒక మహా యజ్ఞం విజయవాడ లో నిర్వహించాలని తీర్మానం చేశారు. ప్రముఖ జ్యోతిష్య
పండితులతో ఉప ముఖ్యమంత్రి సంప్రదించిన మేరకు 12.05.2023 శుక్రవారం నుండి
ద17.05.2023 వరకు ఇట్టి యజ్ఞం ను విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో
నిర్వహించనున్నారు.
ముహూర్తం : స్వస్తి శ్రీ చాంద్రమాన శోభాకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం నందు వసంత
ఋతువు వైశాఖ బహుళ సప్తమి శుక్రవారం మే 12న ఉదయం బ్రాహ్మి ముహుర్తం నందు శ్రీ
విఘ్నేశ్వర పూజతో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభమై మే 17న బుధవారం మధ్యాహ్నం
మహాపూర్ణాహుతి తో సంపూర్ణం అవుతుంది. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సౌభాగ్యం,
సంపద, దర్మాభివృద్ది, వ్యవసాయ పంటల అధిక దిగుబడి కొరకు ఈ మహా యజ్ఞం
నిర్వహిస్తారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో వైఖానసము, పాంచరాత్రం, వైదిక
స్మార్తం, శైవం, చాత్తాడ శ్రీ వైష్ణవం, గ్రామదేవత ఆరాదనము, వీర శైవం,
తంత్రసారము అనే 8 ఆగమముల ప్రకారం హోమ, పారాయణములు సంప్రదాయ బద్ధంగా
నిర్వహిస్తారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం యాగం నిర్వహించబడును. ప్రతీ రోజు
ఉదయం విష్ణు సహస్రనామ పారాయనాధులు జరుగును. ప్రతీ రోజు సాయంకాలం శాంతి కళ్యాణ
మహోత్సవములు నిర్వహిస్తారు. సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, కనకదుర్గ
అమ్మవారు, శ్రీ శైలం దేవాలయముల నుండి రోజుకు ఒక దేవాలయం చొప్పున శాంతి
కళ్యాణం నిర్వహిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆగమ సలహామండలి సభ్యుల సూచనలు
అనుసరించి యజ్ఞం నిర్వహిస్తారు. 8 ఆగమములకు సంబంధించిన దేవాలయముల నుండి 8
ఆగమములకు సంబంధించిన ఋత్వికులను, పరిచారికులను, సహాయకులను ఆయా ఆగమ దేవాలయము
నుంచి మరియు ఆగమ పండితులను జిల్లాల నుండి ఎన్నిక చేస్తారు. ఈ మహా యజ్ఞం యొక్క
సంకల్పం రాష్ట్ర ప్రజలు అందరికి సకల శుభములు లభించడం కోసం, 4 వేధములకు
సంబంధించిన 64 వేద పండితులతో సంపూర్ణ వేద పారాయణం గావించి ఏతత్ మహా ఫలమును
దారపోయడం జరుగుతుంది. వేదపండితులను ఆయా దేవాలయముల నుండి డిప్యూటేషన్ పై
నియమిస్తారు.